రావొద్దని నోటీసులు ఇచ్చిన పోలీసులకు, పూలు ఇచ్చిన అసదుద్దీన్
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీకి బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బెంగళూరులో నిర్వహించదల్చుకున్న సభకు అనుమతిలేదని కర్నాటక పోలీసులు ఆయనకు గురువారం నాడు నోటీసులు ఇచ్చారని సమాచారం.
ఈ నెల 21వ తేదీన బెంగళూరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని మజ్లిస్ పార్టీ భావించింది. దీనికి పోలీసుల అనుమతిని కోరింది. దీంతో దానిని కర్నాటక పోలీసులు నిరాకరించారని సమాచారం. దీంతో అక్కడి పోలీసులు ఆయనకు బెంగళూరులో సభకు అనుమతి లేదని నోటీసులు అందచేశారు.

అయితే, అసదుద్దీన్ ఓవైసీ మాత్రం వారి నోటీసులకు భిన్నంగా స్పందించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను అందుకున్న ఆయన వారికి పూలబొకేలు ఇచ్చి పంపించారని తెలుస్తోంది. కాగా, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మజ్లిస్ పార్టీ బలోపేతమవుతున్న విషయం తెలిసిందే. యూపీలో మజ్లిస్ పార్టీ సభ్యత్వాన్ని లక్షమంది సభ్యులు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications