వీడియో: నీట మునిగిన మాన్యత టెక్ పార్క్: వాటర్ ఫాల్స్- విరిగిపడ్డ మట్టిపెళ్లలు

Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. తీరం వైపు తరుముకొస్తోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- ఏపీ దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపింది.

ప్రస్తుతం ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 10 కిలో మీటర్లు. ఈ తెల్లవారు జాము నాటికి చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకు 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం తెల్లవారు జామున పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.

Bengaluru rains India s largest hub Manyata Tech Park was submerged

దీని ప్రభావంతో బెంగళూరులో వర్షాలు దంచికొడుతున్నాయి. రెండు రోజులుగా కుండపోత వర్షం కురుస్తోంది. దీని దెబ్బకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వర్షపునీరు పోటెత్తింది. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. బలమైన ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.

ఈ ఉదయం 8 గంటల వరకు చౌడేశ్వరిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక్కడ 89.50 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్ట్- 88, విద్యారణ్యపుర- 80.50, జక్కూరు- 75.50, జక్కూరు-2- 73, రాజమహల్ గుట్టహళ్లి- 68.50, హొరమావు-2 67.50, దొడ్డనెక్కుండి- 67, పులకేశినగర- 62.50 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైైంది.

ఈ వర్షాల దెబ్బ ఏ స్థాయిలో ఉందంటే- దేశంలో అతిపెద్ద ఐటీ హబ్ అయిన మాన్యత టెక్ పార్క్ నీట మునిగింది. 300 ఎకరాల్లో విస్తరించిన టెక్ పార్క్ ఇది. దాదాపుగా అన్ని ఐటీ కంపెనీల కార్యాలయాలు ఇక్కడ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్నాయి. ఆయా సంస్థల్లో వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తుంటారు.

అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన హెబ్బాళ- కృష్ణరాజపురం రూట్‌లో ఉంటుందీ పార్క్. అలాంటి టెక్ పార్క్ మూత పడింది. వర్షపు నీరు పోటెత్తడం వల్ల ఐటీ కార్యాలయాలన్నీ కూడా తెరచుకోలేదు. మాన్యత టెక్ పార్క్‌లో నిర్మాణంలో ఉన్న కొన్ని భారీ భవనాల్లో వరద నీరు చొచ్చుకొచ్చింది. అక్కడి నిర్మాణ సామాగ్రి, వాటిని తరలించే వాహనాలు నీట మునిగాయి.

దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటర్ ఫాల్స్‌లాగా అక్కడి నుంచి నీళ్లు కిందికి దూకడం ఈ వీడియోల్లో చూడొచ్చు. ఇదే ఐటీ పార్క్‌లో భవనాల నిర్మాణం కోసం తవ్విన పునాదుల్లో వరద నీరు నిల్వ ఉండటంతో చిన్న సైజు చెరువును తలపిస్తోందా ప్రదేశం.

అక్కడ మట్టి పెళ్లలు విరిగిపడటం ఈ వీడియోల్లో రికార్డయింది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇచ్చాయి ఆయా కార్యాలయాన్నీ. మాన్యత టెక్ పార్క్ కాస్త, మాన్యత టెక్ వాటర్ ఫాల్స్‌గా మారిందంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+