బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: దెబ్బకు ఎక్కడెక్కడో ?, ఐటీ హబ్ లో అలజడి, రెండేళ్లకు బొమ్మపడింది, సినిమా స్కోప్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎన్ఐఏ అధికారుల సోదాలతో ఓ వర్గంలోని నాయకులు, కార్యకర్తలకు సినిమా కనపడుతోంది. పీఎఫ్ఐ పేరుతో ఇంతకాలం అనేక కార్యకలపాలు సాగిస్తున్న వారిని ఎన్ఐఏ అధికారులు, పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బెంగళూరులోని డీజే హళ్లి, కేజీ హళ్లి అల్లర్ల కేసుల్లో ఇంకా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్ఐఏ అధికారుల దెబ్బతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. మంగళూరు, బెంగళూరు నగరంతో సహ ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో డీజే హళ్లి గొడవలకు సంబంధించి బెంగళూరులోనే రెండు సంవత్సరాల తరువాత రెండు అంకెల సంఖ్యలో నిందితులు అరెస్టు కావడం ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

 ఎన్ఐఏ ఎంట్రీతో మొత్తం రివర్స్

ఎన్ఐఏ ఎంట్రీతో మొత్తం రివర్స్

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ నాయకుడు ప్రవీణ్ హత్య కేసును ఎన్ఐఏకి అప్పగించింది. బీజేపీ నాయకుడు ప్రవీణ్ నెట్టూరు అలియాస్ ప్రవీణ్ హత్య కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు. గురువారం వేకువ జామున 3.30 గంటల సమయంలో మంగళూరులో ఎన్ఐఏ అధికారులు రంగంలోకి దిగారు. అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి.

 పీఎఫ్ఐ టాప్ లీడర్ అరెస్టు

పీఎఫ్ఐ టాప్ లీడర్ అరెస్టు

బెంగళూరు డీజేహళ్ళి గొడవల కేసులో పీఎఫ్ఐ కోప్పళ జిల్లా అధ్యక్షుడు అబ్బుదల్ ఫయాజ్ ని పోలీసులు అరెస్టు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులోని డీజేపీహళ్లిలో స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస్ మూర్తి ఇంటిలో నిందితులు పెట్రోల్ పోసి నిప్పంటించడం అప్పట్లో కలకలం రేపింది.

 బెంగళూరు బ్యాండ్ మొదలు

బెంగళూరు బ్యాండ్ మొదలు

బెంగళూరులోని డీజేహళ్లి, కేజీ హళ్లి గొడవలకు సంబంధించి పీఎఫ్ఐ పార్టీకి చెందిన 19 మందిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసులతో పాటు సీసీబీ పోలీసులు రంగంలోకి దిగి పీఎఫ్ఐ నాయకులు మన్సూర్ ఖాన్, యాసిర్ పాషా తో సహ 19 మందిని అరెస్టు చేశారు. మంగళూరు, బెంగళూరు నగరంతో సహ ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో డీజే హళ్లి గొడవలకు సంబంధించి బెంగళూరులో ఇంత మంది అరెస్టు కావడం ఐటీ హబ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Bengaluru riot: Police booked 19 PFI leaders and members in rules break in Bengaluru DG Halli.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X