కోపంతో మత్తు ఇచ్చి, ప్రియుడ్ని కాల్చేసింది
తనను కాదన్నాడనే కోపంతో ఓ యువతి తన ప్రియుడికి మత్తు మందు ఇచ్చి అతన్ని కాల్చేసింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది.
బెంగళూరు: తనను కాదన్నాడనే కోపంతో ఓ యువతి మత్తు మందు ఇచ్చి, తన ప్రియుడిని నిలువునా మంట పెట్టి కాల్చేసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో జరిగింది. ఈ ఘటనలో కాటన్‌పేట పోలీసులు 21 ఏళ్ల పారామెడిక్విద్యార్థినిని అరెస్టు చేశఆరు.
నగరంలో లాడ్జీలో నవంబర్ 28వ తేదీన ఆ సంఘటన జరిగింది. ఆ ఘటనలో గాయపడిన మన్సూర్ అనే 27 యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు. అతను కేరళ రాష్ట్రానికి చెందినవాడు.
బెంగళూరులోని రైల్వే స్టేషన్‌లో టీ, స్నాక్స్ షాపు నడుపుతూ ఉండేవాడు. శ్రుతి అనే యువతి పెయింగ్ గెస్ట్ అకామిడేషన్‌లో ఉంటూ జలహళ్లిలో గల ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతోంది. మైసూరుకు చెందిన శ్రుతికి మన్సూరుతో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.

ప్రతి వారాంతంలో మైసూరుకు వెళ్తున్న క్రమంలో రైల్వే స్టేషన్‌లో మన్సూరుతో పరిచయం ఏర్పడింది. వారిద్దరు నవంబర్ 28వ తేదీన శ్రీకృష్ణ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. ఉదయం 11.30 గంటలకు శ్రుతి గదికి నిప్పు పెట్టి భయాందోళనలతో బయటకు పరుగెత్తుకుని చ్చింది.
ఆమె కూడా కొన్ని నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తామిద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తొలుత శ్రుతి పోలీసులకు చెప్పింది. ఆ తర్వాత తన నేరాన్ని అంగీకరించింది.
గర్భం దాల్చింది....
శ్రుతి, మన్సూరు శారీరకంగా కూడా కలుసుకున్నారు. దీంతో ఆరు నెలల క్రితం ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని శ్రుతి మన్సూర్‌ను అడిగింది. అయితే, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి, అబార్షన్ చేయించుకోవాలని అతను చెప్పాడు. తీవ్ర ఆసంతృప్తికి గురైన ఆమె అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది.
పథకం ప్రకారం ఆమె లాడ్జీలో గది బుక్ చేసి, మన్సూర్‌ను తీసుకుని వెళ్లింది. జ్యూస్‌లో నిద్ర మాత్రలు కలిపింది. అది తాగిన తర్వాత మన్సూర్ స్పృహ కోల్పోయాడు. దాంతో ఆమె పెట్రోల్ పోసి అతనికి నిప్పు పెట్టింది. ఆ తర్వాత గది నంచి బయటకు పరుగెత్తుకొచ్చింది.












Click it and Unblock the Notifications