ఎయిర్‌గన్‌తో బెదిరింపు: టెక్కీని చితకబాదారు
బెంగళూరు: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు తుపాకీ గురిపెట్టి నానా హంగామా సృష్టించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు, స్థానికులు అతడ్ని చితకబాదారు. ఆ తర్వాత అతడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆదివారం బెంగళూరు-మైసూరు హైవే బిదాడి ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి మదికేరికి కెఎస్ఆర్టీసీ బస్సు వెళుతోంది. అదే సమయంలో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పని చేస్తున్న సాత్విక్ అనే ఉద్యోగి హుండాయ్ ఐ20(కెఏ-41ఎంఏ-5269) కారులో బస్సు వెనకాలే వెళ్తున్నాడు.
సాత్విక్ తోపాటు అతని స్నేహితులు మిథున్, వెంకట్‌లు ఉన్నారు. వీరు వినోద యాత్ర కోసం మాండ్యాలోని శ్రీరంగపట్నకు వెళ్తున్నారు.

రాష్‌గా డ్రైవింగ్ చేస్తున్న సాత్విక్.. ముందు ఓ కారును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత ముందున్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బస్సు డ్రైవర్ విశ్వనాథ్ బస్సును స్పీడ్‌గా తీసుకెళ్తూ.. కారుకు సైడ్ ఇవ్వలేదు. ఇలాగే కొన్ని కిలోమీటర్లు ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు సాత్విక్.
అయితే, కోఠి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ ప్రయాణికుడు దిగిపోవాల్సి ఉండటంతో బస్సును ఆపాడు డ్రైవర్. దీంతో సాత్విక్ తన కారును తీసుకొచ్చి.. బస్సు ముందు ఆపాడు. ఆ తర్వాత తనకు సైడ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బస్సు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతేగాక, తన వద్ద ఉన్న ఎయిర్‌గన్ చూపించి బెదిరింపులకు గురిచేశాడు.
ఈ క్రమంలో అది నిజమైన తుపాకీగా భావించిన బస్సులోని 50మంది ప్రయాణికులు సాత్విక్ కారు చుట్టూ నిల్చున్నారు. కాగా, ప్రయాణికులను కూడా మద్యం మత్తులో ఉన్న సాత్విక్ దూషించాడు. దీంతో ప్రయాణికులు కారులోని సాత్విక్‌ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు.
డోర్ తెరవకపోవడంతో కారుపై దాడి చేశారు ప్రయాణికులు. ఆ తర్వాత కారు నుంచి బయటికి వచ్చిన సాత్విక్, అతని స్నేహితులను చితకబాదారు. అనంతరం పోలీసులకు వారిని అప్పగించారు. కాగా, డ్రైవర్ విశ్వనాథ్, సాత్విక్‌లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications