వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నెట్ లో వెతికి మరీ.., పెళ్లి ఇష్టం లేకనేనా?

సాప్ట్‌వేర్ ఇంజనీరు గీతాంజలి(27) ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన ఫోన్ లో ఆత్మహత్య మార్గాలను నెట్‌లో వెతికిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు : సాప్ట్‌వేర్ ఇంజనీరు గీతాంజలి(27) ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన ఫోన్ లో ఆత్మహత్య మార్గాలను నెట్‌లో వెతికిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. గీతాంజలి బెంగళూరు నగరం కడుబీసనహళ్లిలోని చేసన బిజినెస్ పార్కు పదో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ట్విస్ట్: బెంగళూరులో 10వ అంతస్తు నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య, గోవాలో బలవంతంగా!ట్విస్ట్: బెంగళూరులో 10వ అంతస్తు నుంచి దూకి లేడీ టెక్కీ ఆత్మహత్య, గోవాలో బలవంతంగా!

గోవాకు చెందిన గీతాంజలికి ఇటీవలే వివాహ నిశ్చితార్థం జరిగిందని, ఆ యువకుడితో పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గీతాంజలి మొబైల్ ఫోన్ ను పోలీసులు పరిశీలించారు.

techie-geethanjali

ఆత్మహత్య చేసుకునే ముందు.. ఏయే మార్గాల్లో ఆత్మహత్య చేసుకోవచ్చో ఆమె అంతర్జాలంలో వెతికిందని చెబుతున్నారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య ఎలా చేసుకోవాలి? ఎన్ని మాత్రలు మింగాలి? ఏ మాత్రలు మింగాలి? వాటి పేర్లేమిటి? తదితర విషయాలను ఆమె వెతికిందట.

ఈ విషయాన్ని డిప్యూటీ పోలీసు కమిషనర్ అబ్దుల్ అహద్ వెల్లడించారు. అయితే సాప్ట్‌వేర్ ఇంజనీరు గీతాంజలి ఆత్మహత్య ఘటనను అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేసి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Software engineer Geethanjali U, 27, who fell to her death from the terrace of a 10-storey building in Cessna Business Park, Kadubeesanahalli on Wednesday, had searched online on ways to commit suicide, Marathahalli police said. Geethanjali had got engaged at her Goa home on Tuesday, which was also her birthday, they added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X