బెంగళూరు క్రెడిట్ వార్- ఏముంది అందులో?
బెంగళూరులో మెట్రో ఎల్లో లైన్ నేడు ప్రారంభం కాబోతోంది. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. అనంతరం రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు అందులో ప్రయాణించనున్నారు. విద్యార్థులు, ప్రయాణికులతో ముచ్చటించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక ఎల్లో లైన్ పై క్రెడిట్ రాజకీయాలు మొదలయ్యాయి. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆదివారం ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్ క్రెడిట్ కారణమని స్పష్టం చేశారు. దీన్ని బీజేపీ హైజాక్ చేసిందని ఆరోపించారు. ఎల్లో లైన్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత పూర్తిగా తమదేనని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. ఈ లైన్ పూర్తి కావడంలో ఎన్డీఏ కంటే కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ సహకారం అందించిందని స్పష్టం చేశారు.
దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు ప్రియాంక్ ఖర్గే. బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో ప్రారంభోత్సవానికి కర్ణాటకకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం అని అంటూనే.. బీజేపీ #VoteChori నుండి #CreditChori కి దృష్టి మళ్లించిందని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఎల్లో లైన్ ఫేజ్ 2 క్రెడిట్‌ను హైజాక్ చేస్తోందని విమర్శించారు.
ఈ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కొన్ని వివరాలను ఎక్స్ హ్యాండిల్ లో పొందుపరిచారు ప్రియాంక్ ఖర్గే. డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభమైందని గుర్తు చేశారు. తొలి దశలో యూపీఏ ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో అధిక భాగం ఖర్చును భరించిందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహకారం కంటే ఇది చాలా ఎక్కువ అని ఖర్గే తెలిపారు.
ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం వాటాలను గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తగ్గించిందని ఖర్గే ఆరోపించారు. దేశం పట్ల, బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల బీజేపీ నాయకుల్లో తగ్గుతున్న నిబద్ధతకు ఈ పరిణామం అద్దం పట్టిందని ఖర్గే అన్నారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ నిధులు కేటాయించినట్లు వివరించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బెంగళూరు ఎల్లో మెట్రో లైన్ ప్రాజెక్టు పట్ల నిబద్ధత తగ్గిందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. తదుపరి దశల్లో కేంద్ర ప్రభుత్వ వాటా విపరీతంగా తగ్గిందని, కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఖర్చులను భరించింది, భూసేకరణ, ఇతర వ్యయాలతో కలిపి మొత్తం 12,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించిందని చెప్పారు
దీనికి విరుద్ధంగా.. కేంద్ర ప్రభుత్వం కేవలం 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అందించిందని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. ఇది కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. కొద్దిపాటి నిధులను ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కేంద్రం నుంచి సహకారం లేకపోవడం వల్లే మిగిలిన దశలను భరించడానికి రుణాలు తీసుకోవలసి వచ్చిందని అన్నారు.
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ












Click it and Unblock the Notifications