యూపీ అభివృద్ది.. దేశాభివృద్ది, కుటుంబపాలనపై హర్దొలి సభలో మోడీ ఫైర్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి మూడో విడత పోలింగ్ ఇవాళ కొనసాగుతోంది. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం మందకొడిగా సాగుతుంది. ఇటు హర్దొయ్‌లో బహిరంగ సభపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. గతంలో ఇక్కడ ఉన్న ప్రభుత్వం ప్రజలు, సంక్షేమ కార్యక్రమాలు అంటే పట్టించుకోలేదని మోడీ ధ్వజమెత్తారు.
అప్పుడు మాఫియా, క్రిమినల్స్‌కు సపోర్ట్ చేశారని మోడీ మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిస్థితి మారిపోయిందని చెప్పారు. హర్దొయ్ ప్రజలు ఈ సారి రెండు సార్లు హోళి జరుపుకునేందుకు సిద్దంగా ఉండాలని మోడీ కోరారు. ఒకటి సాంప్రదాయ హోళి కాగా.. మరొకటి, ఫలితాలు వెలుబడిన మార్చి 10వ తేదీ అని చెప్పారు. ఆ రోజున పోలింగ్ బూతుల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని శ్రేణులకు మోడీ సూచించారు.

కాంగ్రెస్ పార్టీతోపాటు సమాజ్ వాదీ పార్టీపై మోడీ ఫైరయ్యారు. 2014 నుంచి 2017 వరకు ఇక్కడ కుటుంబ పాలన ఉందన్నారు. తాను కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి అని చెప్పారు. ఆ సమయంలో యూపీ నుంచి తాను ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించానని గుర్తుచేశారు. కానీ ఏం ప్రయోజనం లేదని.. కుటుంబపాలన తనను అడ్డుకుందని వివరించారు. తమకు మరోసారి పట్టం కడితే సుపరిపాలన అందజేస్తామని చెప్పారు.
ఇవాళ అధిక సంఖ్యలో పోలింగ్ జరుగుతుందని.. ఆ ఓట్లు బీజేపీకి పడుతున్నాయని మోడీ ఆకాంక్షించారు. పంజాబ్ ప్రభుత్వ తీరున చూసిన తర్వాత.. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని వివరించారు. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉండేదని మోడీ గుర్తుచేశారు. చిరు వ్యాపారులు బిజినెస్ చేయడానికి భయపడేవారని చెప్పారు. దొంగతనాలు, రోడ్లపైనే దోపిడీలు జరిగేవని చెప్పారు. ఓడిపోయిన వారు తమ విద్వేషం వ్యాపించజేశారని ఆరోపించారు. కులం పేరు విద్వేష రాజకీయాలు చేశారని వివరించారు. యూపీ అభివృద్ది.. దేశాభివృద్ది అని మోడీ అన్నారు.












Click it and Unblock the Notifications