టెకీ మృతి కేసులో సంచలనం.. నోయిడా అథారిటీ సీఈఓపై వేటు
ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఒక నిర్మాణ స్థలంలో ఉన్న నీటి గుంతలో ఓ యువ ఇంజినీర్ కారు అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ టెకీ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటనను యూపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు నోయిడా అథారిటీ సీఈఓ ఎం లోకేశ్ పై వేటు వేసింది. అంతేకాక ఈ ప్రమాదంపై సిట్ విచారణకు ఆదేశించింది. ఐదు రోజుల్లో రిపోర్టు సబ్‌మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ నోయిడా సెక్టార్ 150 లో కారు అదుపుతప్పి నీటితో నిండిన గుంతలో పడి 27 ఏళ్ల టెకీ మరణించిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు నోయిడా అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం. లోకేశ్ ను పదవి నుంచి తొలగించింది. ఈ ఘటనపై తక్షణమే సిట్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, జోన్ మీరట్ నేతృత్వంలో త్రిసభ్య దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో మీరట్ డివిజనల్ కమిషనర్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజనీర్ కూడా ఉన్నారు. ఈ బృందం ఐదు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏం జరిగిందంటే..?
గురుగ్రామ్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా యువరాజ్ మోహతా పని చేస్తున్నాడు. రోజూలాగే ఆఫీస్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో నోయిడాలోని సెక్టార్- 150లోని ఏటీఎస్ లే గ్రాండియోస్ కూడలి వద్ద ప్రమాదవశాత్తు కారు అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్టి.. ఆ తర్వాత పక్కనే ఉన్న నీటి గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 27 ఏళ్ల యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యువరాజ్ మెహతా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమయంలో సహాయక చర్యలు కూడా సకాలంలో అందలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
అయితే అతివేగం, పొగమంచు, రోడ్డు పరిస్థితులు.. ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన మోనిందర్ మాట్లాడుతూ.. యువరాజ్ గంటా నలభై ఐదు నిమిషాల పాటు "దయచేసి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి" అని ప్రాధేయపడ్డాడని వివరించాడు. నీటి లోతు ఎక్కువగా ఉండటం, భద్రతా సిబ్బంది లేకపోవడం వల్ల సకాలంలో రక్షించ లేకపోయారని తెలిపారు.

మరోవైపు ఇదే ఘటనపై యువరాజ్ తండ్రి నోయిడా అథారిటీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సెక్టార్ 150 నివాసితులు డ్రైయిన్ కు సమీపంలో బారికేడ్లు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయమని పదేపదే విజ్ఞప్తి చేసినా, అథారిటీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని తెలిసినా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications