Bihar Elections: బిహార్ బరిలో అత్యంత ధనిక, పేద అభ్యర్థులు వీళ్లే..

బిహార్ లో తొలి దశ పోలింగ్ కు రంగం సిద్ధమైంది. నవంబర్ 6 గురువారం రోజున బిహార్ లోని 243 స్థానాలకుగాను తొలి దశలో భాగంగా 121 నియోజకవర్గాలకు ఓటింగ్‌ జరగనుంది. మిగిలిన 122 స్థానాలకు నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఫలితాలను నవంబర్ 14 వెల్లడించనున్నారు. మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే.. అలాగే సీఎం పీఠం కోసం RJD నేతృత్వంలోని మహాగఠ్‌ బంధన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. జన్ సురాజ్ అధినేత ప్రశాంత్ కిశోర్.. తొలిసారి బిహార్ ఎన్నికల బరిలో నిలిచారు. దీంతో ఈ సారి పోటీ రసవత్తరంగా మారనుంది.

అయితే 243 సీట్లకు గాను 2,600 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 1,081 మంది అంటే 42 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇక 2020 బిహార్ పోల్స్ లో మొత్తం 3,722 మంది అభ్యర్థులకు గాను 1,231 మంది అంటే 33శాతం మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అత్యంత ధనవంతులుగా రన్ కౌశల్ ప్రతాప్ ఉన్నారు. ఈయన వీఐపీ పార్టీకి చెందిన అభ్యర్థి. లౌరియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రన్ కౌశల్ ప్రతాప్ ఆస్తుల విలువ రూ. 373 కోట్లుగా ఉంది. రెండో ధనిక అభ్యర్థిగా నితీశ్ కుమార్.. ఆర్ఎల్జేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. గురువా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 250 కోట్లుగా ఉంది.

ఇక మూడో స్థానంలో కుమార్ ప్రణయ్ బీజేపీ నుంచి ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 170 కోట్లుగా ఉంది. ముంగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో రాజ్ కిషోర్ గుప్తా ఇండిపెండెంట్ గా బరిలో నిలిచారు. మహారాజ్ గంజ్ నుంచి పోటీ చేస్తున్న ఆయన ఆస్తుల విలువ రూ. 137 కోట్లుగా ఉంది. ఆ తర్వాత మోకమా నియోజకవర్గం నుంచి అనంత్ సింగ్ పోటీ చేస్తున్నారు. జేడీయూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ. 100 కోట్లుగా ఉంది.

Bihar Ballot Billionaires vs Paupers Richest at 80 Cr Poorest at 1 000 in 2025 Polls

పేద అభ్యర్థుల వివరాలు చూస్తే.. పీర్పైంటి(ఎస్సీ) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సునీల్ కుమార్ నెట్ వర్త్ జీరో గా ఉంది. ఆయన బీఎస్పీ పార్టీకి చెందినవారు. దర్భాంగా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మొజాహిద్ అలామ్.. సుసీ(సీ) పార్టీకి చెందినవారు. ఆయన ఆస్తుల విలువ రూ.1000.. అలాగే శత్రుదన్ వర్మా పీపీఐ(డీ) పార్టీకి చెందినవారు. ఆయన భార్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ కూడా రూ.1000 గా ఉంది. అలాగే ఎంఎస్పీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సురేశ్ రాజ్ వన్శీ వాజీర్ గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తుల విలువ రూ. 1100 గా ఉంది. అలాగే మీనాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శివ్ కుమార్ యాదవ్ సుసీ(సీ) పార్టీకి చెందినవారు. ఆయన ఆస్తుల విలువ రూ. 2023 గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+