బీహార్ ఎన్నికల ఫలితాలపై వివాదం: మేనల్లుడి ప్రాణం తీసిన మామలు!

రాజకీయ అభిమానం ఉండాలి కానీ అది హద్దులు దాటొద్దు. అలాంటి అభిమానం హద్దులు దాటితే ఎంత దారుణానికి దారితీస్తుందో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరం వెల్లడిస్తోంది. కేవలం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మొదలైన చర్చ కారణంగా మద్యం మత్తులో ఉన్న సొంత మేనమామలే తమ మేనల్లుడిని బురదలో తొక్కి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని శివ్ హార్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు శంకర్ మాంఝీ(22), అతని ఇద్దరు మేనమామలు రాజేశ్ మాంఝీ (25), తుఫానీ మాంఝీ (27) ఉపాధి కోసం మధ్యప్రదేశ్‌లోని గుణకు వలస వచ్చి కూలి పనులు చేసుకుంటున్నారు. శంకర్ మాంఝీ రాజేశ్, తుఫానీల సోదరి కుమారుడు (మేనల్లుడు). ఆదివారం రోజున ఈ ముగ్గురూ కలిసి మద్యం సేవిస్తూ మాట్లాడుకుంటుండగా.. చర్చ బీహార్ ఎన్నికల రాజకీయాల వైపు వెళ్లింది.

Bihar Election Result Argument Turns Deadly Two Uncles Kill Nephew in Madhya Pradesh

మేనల్లుడు శంకర్ రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీకి మద్దతుదారు కాగా.. మేనమామలు రాజేశ్, తుఫానీ జనతాదళ్ (యునైటెడ్) (JDU) పార్టీ అభిమానులు కావడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కూటమిగా పోటీచేసిన జేడీయూ ఘన విజయం సాధించగా.. ఆర్జేడీ ఘోర వైఫల్యాన్ని మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆర్జేడీకి మద్దతుగా శంకర్ మాట్లాడటంతో ఇద్దరు మామలకు ఆగ్రహం పెరిగింది.

బురదలో తొక్కి హత్య
ముగ్గురూ బాగా మద్యం మత్తులో ఉండటంతో ఎవరూ వెనక్కి తగ్గలేదు. మామా అల్లుళ్ల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో రాజేశ్, తుఫానీ మాంఝీ ఇద్దరూ కలిసి శంకర్ మాంఝీపై దాడి చేశారు. సమీపంలో ఉన్న బురదలోకి శంకర్‌ను ఈడ్చుకెళ్లి, అమానుషంగా కింద పడేసి తొక్కడం మొదలుపెట్టారు. బురదలో ఊపిరి ఆడక శంకర్ మాంఝీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గొడవ గురించి చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులైన రాజేశ్, తుఫానీ మాంఝీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎన్నికల ఫలితాలపై అభిమానం ఓ యువకుడి ప్రాణం తీయడం అందరినీ కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+