బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్: 11మంది దోషులకు జీవిత ఖైదును సమర్థించిన హైకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు మరణదండన విధించాలన్న సీబీఐ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఈ కేసులో 11 మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచారం కేసులో దోషులకు మరణదండన విధించాలన్న సీబీఐ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, ఈ కేసులో 11 మందికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను కొనసాగించాలని తీర్పిచ్చింది. ఈ కేసులో కీలక నిందితులైన జస్వంత్ నాయ్, గోవింద నాయ్‌లకు మరణశిక్ష విధించాలని సీబీఐ చేసిన విజ్ఞప్తిని నిరాకరించింది.
2002లో గోద్రా అల్లర్ల తరువాత అహ్మదాబాద్ సమీపంలోని రాందిక్ పూర్ గ్రామనికి చెందిన బానో ఇంటిలోకి చొరబడిన నిరసనకారులు, నిండు గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెపై గ్యాంగ్ రేప్‌నకు పాల్పడి, ఎనిమిది మంది కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేయడం జరిగింది.

బిల్కిస్ మరో ఇద్దరు మాత్రం బతికి బట్టకట్టారు. అప్పుడు ఆమె వయసు 19ఏళ్లు. ఈ కేసును విచారించిన ముంబై ప్రత్యేక కోర్టు 2008లో తీర్పును వెలువరిస్తూ.. 12 మందిని దోషులుగా తేలుస్తూ.. 11 మందికి యావజ్జీవ శిక్షను విధించింది.
మరో ఏడుగురిని సాక్ష్యాలు లేని కారణంగా వదిలేసింది. తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యున్నత న్యాయస్థానం కేసు పునర్విచారణ బాధ్యతలను బాంబే హైకోర్టుకు అప్పగించింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications