బెంగళూరు విభజన: కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ)ని ముక్కలు చెయ్యాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. విభజనపై ఓటింగ్ పెట్టడంతో అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. రెండు ఓట్ల తేడాతో ప్రభుత్వం ఓడిపోయింది.
బీబీఎంపీని విభజించాలని కర్ణాటక మునిసిపల్ కార్పొరేషన్ చట్టం- 2015 బిల్లును సోమవారం విదాన పరిషత్ లో ప్రవేశ పెట్టారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య తరఫున న్యాయశాఖ మంత్రి టి.బి. జయచంద్ర బిల్లును సభలో ప్రవేశ పెట్టారు.
ఆ సందర్బంలో బీజేపీ సభ్యుడు, మాజీ మంత్రి వి. సోమణ్ణ మాట్లాడుతూ - బెంగళూరును మూడు ముక్కలు చెయ్యాలని మొదట్లో మీరు చెప్పారు, ఇప్పుడు బెంగళూరును ఐదు ముక్కలు చెయ్యాలని ప్రత్యేక కమిటి సిఫారస్సు చేసిందని గుర్తు చేశారు.

బెంగళూరును ఎన్ని ముక్కలు చేస్తారో మీకే అర్ధం కావడం లేదని విరుచుకుపడ్డారు. సభ్యలు మధ్య వాగ్వివాదం జరిగింది. తరువాత సభాపతి ఓటింగ్ పెట్టారు. బెంగళూరును విభజించాలని 28 మంది సభ్యులు, విభజించరాదని 30 మంది సభ్యులు ఓట్లు వేశారు. ఈ దెబ్బతో ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
బీబీఎంసిని విభజించాలని ఇప్పటికే విధాన సభలో అంగీకారం జరిగింది. అయితే విధాన పరిషత్ లో ఈ బిల్లును తిరస్కరించారు. అయితే బెంగళూరును విభజించాలని పట్టు బట్టి కూర్చున్న కాంగ్రెస్ మళ్లి విదాన సభలో బిల్లు ప్రవేశ పెట్టి అమోద ముద్ర వేయించుకుని నివేదికను గవర్నర్ కు పంపించాలని నిర్ణయించింది.












Click it and Unblock the Notifications