వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒలింపిక్స్ కాదు మిత్రమా రాజకీయాలు, ఓటర్ల దెబ్బకు స్టార్ రెజ్లర్ దత్ హాం ఫట్!

|
Google Oneindia TeluguNews

హరియాణా: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల నాడి పసిగట్టడంలో ఎగ్జిట్ పోల్స్ తో పాటు అన్ని రాజకీయ పార్టీలు విఫలం అయ్యాయని వెలుగు చూస్తోంది. హరియాణా ఓటర్ల నాడి పట్టుకోవడంలో ఆ రాష్ట్రంలో ఇంత కాలం అధికారంలో ఉన్న బీజేపీ సైతం దెబ్బ తినింది. ఇదే సమయంలో ఎన్నో అశలతో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన 2012 ఓలింపిక్స్ కాంస్య పతకం విజేత యోగేశ్వర్ దత్ సైతం హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఓటర్ల దెబ్బకు స్టార్ రెజ్లర్ యోగేశ్వర్ దత్ రాజకీయాల్లో హాం ఫట్ అన్నారు.

ఒలింపిక్స్ లో కాస్యం

ఒలింపిక్స్ లో కాస్యం

2012 ఒలింపిక్స్ యోగేశ్వర్ దత్ కాంస్య పతకం సాధించారు. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో యోగేశ్వర్ దత్ ను గౌరవించింది. 2014 కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించిన యోగేశ్వర్ దత్ తన సత్తా చాటారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ రెజ్లర్ (కుస్తీ యోధుడు) యోగేశ్వర్ దత్ పేరు మార్మోగిపోయింది.

లోక్ సభ ఎన్నికల్లో నో చాన్స్

లోక్ సభ ఎన్నికల్లో నో చాన్స్

ఇదే సమయంలో రెజ్లర్ యోగేశ్వర్ దత్ తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత లోక్ సభ ఎన్నికల్లో యోగేశ్వర్ దత్ రోహతక్ లేదా సోనేపట్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే చివరికి నిమిషంలో బీజేపీ పెద్దలు వారి నిర్ణయం మార్చుకోవడంతో అది జరగలేదు.

నువ్వానేనా

నువ్వానేనా

2019 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బరోడా నియోజక వర్గం నుంచి యోగేశ్వర్ దత్ బరిలో దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కృష్ణన్ హుడా బరిలోకి దిగారు. బరోడాలో నువ్వానేనా అంటూ ఇద్దరూ ప్రచారం చేశారు. గురువారం ఓట్ల లెక్కింపు సందర్బంలో మొదటి రౌండ్స్ లో యోగేశ్వర్ దత్ లీడింగ్ లో ఉన్నారు.

సీన్ రివర్స్

సీన్ రివర్స్

ఎన్నికల కౌంటిగ్ లో తరువాత సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణన్ హుడా దూసుకుపోవడంతో యోగేశ్వర్ దత్ వెనకబడి పోయారు. ఎమ్మెల్యేగా విజయం సాధించి నవంబర్ 2వ తేదీ పుట్టిన రోజు జరుపుకోవాలని ఎదురు చూసిన యోగేశ్వర్ దత్ కు నిరాశ మిగిలింది. యోగేశ్వర్ దత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందారు.

స్టార్ రెజ్లర్స్

స్టార్ రెజ్లర్స్

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో రెజ్లర్ యోగేశ్వర్ దత్ తో పాటు మహిళా రెజ్లర్ బబితా ఫొగట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దాద్రీ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన బబితా ఫొగ్లట్ మొదటి రౌండ్ లో ముందజలో ఉన్నా తరువాత వెనుకబడిపోయారు. మొత్తం మీద హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ రెజ్లర్ లను స్థానిక ప్రజలు ఆదరించకపోవడంతో బీజేపీ నాయకుల అంచనాలు రివర్స్ అయ్యాయి.

English summary
Haryana Assembly election results 2019: Wrestler, BJP candidate Yogeshwar Dutt faced defeat in Baroda constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X