25 ఏళ్ల తరువాత మైసూరు రాజవంశంలో అనూహ్య పరిణామం
Yaduveer Krishnadatta Chamaraja Wadiyar: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. గడువు సమీపించింది. ఇంకో రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది.
ఈ క్రమంలో అన్ని పార్టీలు కూడా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తోన్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తాజాగా భారతీయ జనతా పార్టీ కొద్దిసేపటి కిందటే తన రెండో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ సహా ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తరాఖండ్‌లల్లో ఎంపిక చేసిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

కర్ణాటకలోని మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన పేరు కనిపించింది ఈ జాబితాలో. మైసూరు రాజవంశానికి టికెట్ కేటాయించింది బీజేపీ. మైసూరు మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ టికెట్ ఎన్నికల రేసులో నిలిపింది. పార్టీలో చేరకముందే యదువీర్ పేరును ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
25 సంవత్సరాల తరువాత మైసూరు రాజవంశీయులు ఎన్నికల బరిలో దిగడం ఆసక్తి రేపుతోంది. గతంలో శ్రీకంఠదత్త నరసింహ వడియార్.. నాలుగుసార్లు మైసూరు-కొడగు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1984, 1989, 1996, 1999 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా విజయఢంకా మోగించారు.

ఇప్పుడు ఆయన రాజకీయ వారసుడిగా యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్.. ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నారు. సిట్టింగ్ ఎంపీ ప్రతాప సింహకు బీజేపీ ఈ సారి హ్యాండ్ ఇచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో ప్రతాప సింహ భారీ మెజారిటీతో కాంగ్రెస్ ఓడించారిక్కడ. ఈ దఫా ఆయనకు టికెట్ దక్కలేదు.












Click it and Unblock the Notifications