మోదీ మార్క్, దెబ్బకు కమలం నాయకులు అలర్ట్, మళ్లీ రిపీట్ అయితే పరువు పోతుందని !

కర్ణాటకలో చేతులారా అధికారం కోల్పోయిన బీజేపీ ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే సామెతలా అలర్ట్ అయ్యింది. లోక్ సభ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు మాత్రం సమయం ఉండటంతో ఇప్పటి నుంచి లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్దం చేసుకుంటున్నది. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ హైకమాండ్ శనివారం కర్ణాటక బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ లను నియమించింది.

లోక్ సభ ఎన్నికల కర్ణాటక ఇన్ చార్జ్ లుగా రాజ్యసభ ఎంపీ రాధామోహన్ దాస్ అగర్వాల్‌ను, కో-ఇన్‌చార్జ్‌గా మాజీ మంత్రి డాక్టర్ సుధాకర్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు వివిధ నేతలను ఇన్‌ఛార్జ్‌లు, కన్వీనర్‌లను నియమించింది. లోక్‌సభకు సిద్ధమవుతున్న కర్ణాటక రాష్ట్ర బీజేపీ బెంగళూరులోని ప్యాలెస్‌ గ్రౌండ్స్‌లో శనివారం జరిగిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లు, కోఅర్డినేటర్లను నియమించింది. .

BJP High Command appoints in-charges for 28 Lok Sabha constituencies in Karnataka

కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లు, కోఅర్డినేటర్ల వివరాలు !

మైసూరు: ఇన్‌ఛార్జ్ డా. అశ్వత్ నారాయణ్, కోఅర్దినేటర్లు, రవిశంకర్, రాబిన్ దేవయ్య. చామరాజనగర్ ఇన్ చార్జి గా ఎంవీ పనీష్, కోఅర్డినేటర్ గా కండక్టర్ మల్లికార్జునప్ప, మండ్య ఇన్ చార్జి గా సునీల్ సుబ్రమణి, కోఅర్డినేటర్ గా సీపీ ఉమేష్. హసన్ ఇన్ చార్జి గా ఎంకే ప్రాణేష్, కోఅర్డినేటర్ గా ప్రసన్న, దక్షిణ కన్నడ ఇన్ చార్జిగా కోట శ్రీనివాస్ పూజారి, కోఅర్డినేటర్ గా నితిన్ కుమార్. ఉడిపి చిక్కమగళూరు ఇన్‌చార్జిగా అరగ జ్ఞానేంద్ర, కోఅర్డినేటర్లగా నవీన్ శెట్టి కుత్యారు, రవీంద్ర బెలవాడి, శివమొగ్గ ఇన్‌ఛార్జ్ గా రఘుపతి భట్, కోఅర్డినేటర్ గా గిరీష్ పటేల్. ఉత్తర కన్నడకు హరతలు హాలప్ప ఇన్‌చార్జిగా, కోఅర్డినేటర్ గా నయమించారు

ధారవాడ ఇన్ చార్జిగా ఈరన్న కాదాడి, కోఅర్డినేటర్ గా నాగరాజ్, హావేరి ఇన్ చార్జిగా అరవింద్ బెల్లాడ్, కోఅర్డినేటర్ గా కలకప్ప బండి, చిక్కోడి ఇన్ చార్జిగా అభయ్ పాటిల్, కోఅర్డినేటర్ గా రాజేష్ నెర్లి , బాగల్‌కోట్ ఇన్‌ఛార్జ్ గా లింగరాజు పాటిల్, కోఅర్డినేటర్ గా సిద్దు సవది, బీజాపూర్ ఇన్ చార్జి రాజశేఖర్ శీలవంత్, కోఅర్డినేటర్ గా అరుణ్ షాపూర్, బీదర్ ఇన్ చార్జి అమర్ నాథ్ పాటిల్, కోఅర్డినేటర్ గా అరహంత్ సాల్లే. గుల్బర్గా ఇన్ చార్జిగా రాజుగౌడ్, కోఅర్డినేటర్ గా శోభా రాణిని నియమించారు.

BJP High Command appoints in-charges for 28 Lok Sabha constituencies in Karnataka
రాయచూర్ ఇన్ చార్జి దొడన గౌడ పాటిల్, కోఅర్డినేటర్ గా గురు కమ. కొప్పళ ఇన్ చార్జి రఘునాథరావు మల్కాపురే, కోఅర్డినేటర్ గా గిరిగౌడ్, బళ్లారి ఇన్ చార్జి ఎన్ రవికు,మార్, కోఅర్డినేటర్ గా యం.సతీష్, దావణగెరె: ఇన్ చార్జిగా బైరతి బసవరాజ్, కోఅర్డినేటర్ గా వీరేష్ హనగవాడి, చిత్రదుర్గ ఇన్‌చార్జి చన్నబసప్ప, కన్వీనర్ గా లింగమమూర్తి, తుమకూరు ఇన్‌చార్జి గోపాలయ్య, కన్వీనర్ గా బైరన్న చిక్కబళ్లాపుర ఇన్‌ఛార్జ్ కట్టాసుబ్రహ్మణ్య నాయుడు, కన్వీ.నర్ గా ఎ. వి నారాయణ స్వామిని నియమించారు.

కోలార్ ఇన్ చార్జి బి. సురేష్ గౌడ, కన్వీనర్ మైగేరి నారాయణ స్వామి, బెంగళూరు రూరల్ కన్వీనర్ నిర్మల కుమార్ సురానా, కన్వీనర్ గా మునిరత్న, బెంగళూరు సౌత్ కన్వీనర్ ఎం కృష్ణప్ప, కన్వీనర్ ఉమేష్ శెట్టి, బెంగళూరు సెంట్రల్ కన్వీనర్ గురురాజ్ గంటిహూలి, కోఅర్డినేటర్ గా గౌతం కుమార్ జైన్, బెంగళూరు నార్త్ కన్వీనర్ ఎస్. ఆర్ విశ్వనాథ్, కోఅర్డినేటర్ గా సచ్చిదానంద మూర్తిని నియమిస్తూ శనివారం బీజేపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచి సర్వం సిద్దం చేసుకుంటున్నది. కర్ణాటకలోని 28 లోక్ సభ నియోజక వర్గాలకు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప వర్గానికి పెద్దపీట వెయ్యడంతో బీఎల్ సంతోష్ వర్గానికి షాక్ ఇచ్చినట్లు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+