సుమలతకు లాస్ట్ చాన్స్ ఇచ్చిన హైకమాండ్ ?, ఆంధ్రా ఫీలింగ్, కాపు ఓట్లతో రెండు స్కెచ్ లు !
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ల కోసం ఆశావహులు తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం 28 నియోజకవర్గాల్లో మండ్య లోక్‌సభ నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. మండ్య నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ సుమలత అంబరీష్‌కు బీజేపీ టిక్కెట్టు నిరాకరించడంతో ఇప్పుడు ఆమె ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
సుమలతను కూల్ చేసేందుకు బీజేపీ హైకమాండ్ ముందుకు వచ్చింది. మండ్య లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీష్ ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. మండ్యలో విపరీతమైన అభిమానులు ఉన్న నటుడు, సుమలత భర్త, దివంగత రాజకీయ నాయకుడు అంబరీష్ అభిమానుల మద్దతు సుమలతకు చాలా ఎక్కువగా ఉంది. అందుకే సుమలత గతసారి పార్టీయేతర అభ్యర్థిగా మండ్యలో పోటీ చేసి భారీ ఓట్ల తేడాతో ఎంపీగా ఆమె గెలుపొందారు.

అనంతరం ఎంపీ సుమలత కేంద్రంలో బీజేపీకి మద్దతు పలికారు. అయితే ఇప్పుడు జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. దీంతో మండ్యలో జేడీఎస్ అభ్యర్థి పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి కారణం మండ్యలో పోటీ చేయాలని భావిస్తున్న సుమలతకు గట్టి ఎదురుదెబ్బ పడింది. సుమలతకు ఎంపీ టిక్కెట్ ఇస్తే ఆమెకున్న భారీ ఓట్లు బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థికే పడే అవకాశం బలంగా ఉంది.
దీంతో సుమలతను బుజ్జగించేందుకు బీజేపీ హైకమాండ్ ముందుకు వచ్చింది. మండ్య ఎంపీ టికెట్ ఆశించిన సుమలత దేశ రాజధానికి వెళ్లారు. జేపీ నడ్డా అభ్యర్థన మేరకు రాష్ట్ర రాజకీయాలపై చర్చించేందుకు వచ్చానని ఢిల్లీలో సుమలత మీడియాకు చెప్పారు. అయితే చిక్కబళ్లాపురం నుంచి బీజేపీ టికెట్‌పై సుమలత పోటీ చేసే విషయంలో వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు. చిక్కబళ్లాపురంలో సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీఎన్ బచ్చేగౌడ ప్రత్యక్ష ఎన్నికల నుంచి, రాజకీయాల నుంచి తప్పుకున్నారు
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్ కే సుధాకర్, యలహంక బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్ కుమారుడు అలోక్ ఇప్పటికే చిక్కబళ్లాపురం బీజేపీ ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు. సుమలత ప్రాతినిధ్యం వహిస్తున్న మండ్య నియోజక వర్గం బీజేపీ కూటమి భాగస్వామి జేడీఎస్‌లోకి వెళ్లడంతో తనకు ప్రత్యామ్నాయ స్థానం నుంచి టికెట్ ఇవ్వాలని సుమలత బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్ సభ నియోజకవర్గం నుండి బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి కాంగ్రెస్-జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నిఖిల్ కుమారస్వామిపై విజయం సాధించారు.
తెలుగు ఎక్కువగా మాట్లాడే అసెంబ్లీ నియోజకవర్గాలు చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజక వర్గం పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. అలాంటి చిక్కబళ్లాపురం లోక్ సభ నియోజక వర్గం నుంచి అలనాటి స్టార్ హీరోయిన్, తెలుగింటి ఆడపడుచు, సిట్టింగ్ ఎంపీ పోటీ చేసేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నారా ? లేదా ? అనే అంశంపై అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి బీజేపీ అగ్ర నాయకత్వం ఆమెను దేశ రాజధానికి పిలిపించింది.

బలిజ సామాజికవర్గానికి చెందిన యువనేత రక్షా రామయ్యను పోటీకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నందున, అదే సామాజికవర్గానికి చెందిన సుమలతను పోటీకి దింపేందుకు బీజేపీ సిద్ధమైందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. నియోజకవర్గంలో చాలా మంది బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నారు. చిక్కబళ్లాపురం నుంచి సుమలతను పోటీకి దింపితే, ఆమె తరపున ప్రచారం చేయమని మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని బీజేపీ కోరింది.
2014లో మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీపై పోటీ చేసి విఫలమైనప్పటి నుంచి కుమారస్వామి ఆ నియోజక వర్గానికి కొంచెం దూరంగా ఉంటున్నారు. మండ్యలో జేడీఎస్ అభ్యర్థికి ప్రచారం చేయాలని బీజేపీ నేతలు సుమలతను కోరనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిక్కబళ్లాపురం నుంచి పోటీ చేసేందుకు ఎంపీ సుమలత అంగీకరిస్తారా ?, లేదా ఆ నియోజక వర్గం జేడీఎస్ కు వెళ్లిపోతుందా ? అని అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications