ప్రచార పిచ్చి పట్టిందా?, ఒక్కరాత్రిలోనే..: ప్రకాష్ రాజ్‌కు బీజేపీ హెచ్చరిక
Recommended Video

బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోడీ తన కంటే పెద్దనటుడని వ్యాఖ్యానించిన బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌పై కన్నడ బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారమిక్కడ ఎంపీ శోభా కరంద్లాజే, ఎమ్మెల్యే సురేశ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.
ప్రచార పిచ్చి ఉంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలి గానీ.. ఉన్నత పదవుల్లో ఉన్నవారిపై విచక్షణారహితంగా మాట్లాడకూడదని మండిపడ్డారు. ప్రధానిని విమర్శిస్తే రాత్రికి రాత్రే జాతీయస్థాయిలో పేరు వస్తుందనే భ్రమలో నోరు జారొదంటూ హెచ్చరించారు.

కాగా, గౌరీలంకేశ్ హత్యపై ప్రధాని మౌనానికి నిరసనగా తాను జాతీయ అవార్డులు వెనక్కి ఇస్తానని అన్నట్లు వచ్చిన వార్తలను ప్రకాశ్‌రాజ్ మంగళవారం తోసిపుచ్చారు. ఎంతో కష్టపడితే దక్కిన పురస్కారాలని.. వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని అన్నారు. అంతేగాక, అవి దక్కినందుకు ఎంతో గర్వపడుతున్నానని, వాటిని తిరిగి ఇచ్చేంత మూర్ఖుడిని కాదని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications