ట్రిపుల్ తలాక్: ఎంపీలకు బీజేపీ విప్, ప్రశంసించిన ములాయం కోడలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మహిళలకు సమానత్వం తీసుకు వచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోకసభలో ఇటీవల పాస్ అయింది. ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. బీజేపీకి రాజ్యసభలో బలం లేదు. ఇతర పార్టీలపై ఆధారపడాల్సిందే.

మానవత్వానికి సంబంధించినది: ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోకసభ ఆమోదం

ట్రిపుల్ తలాక్ బిల్లును బుధవారం రాజ్యసభలో ప్రవేశ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలకు బీజేపీ విప్ జారీ చేసింది. సభకు అందరూ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

BJP issues whip on triple talaq legislation

మహిళలకు కూడా సమానత్వం కోరుకునే ట్రిపుల్ తలాక్ బిల్లును విపక్షాలు తప్పుబట్టాయి. ఈ బిల్లు లోపభూయిష్టంగా ఉందని విమర్శించాయి.

ట్రిపుల్ తలాక్ బిల్లును ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా ఆమె బిల్లును సమర్థించారు. ఇది స్వాగతించదగిన చర్య అని, మహిళల సాధికారతకు ఇది దోహదం చేస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ముస్లీం మహిళల హక్కులను కాపాడుతుందన్నారు. అనాదిగా ముస్లీం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యకు దీని ద్వారా పరిష్కారం దొరుకుతుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The BJP issued a whip to its MPs asking them to be present in th Rajya Sabha on Wednesday when the government plans to introduce the bill that criminalises the practice of instant Triple Talaq.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి