ప్రతి ఇంటి మీద హనుమాన్ జెండాలు కట్టండి, ప్రభుత్వానికి చాలెంజ్ చేసిన ప్రతిపక్షం, అసలు మ్యాటర్ !
కర్ణాటకలోని మండ్య జిల్లా కేరగోడు గ్రామంలో హనుమాన్ జెండాను కిందకు దించేసిన వాళ్లకు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలని బీజేపీ నిర్ణయించింది. కేరగోడు గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తమ ఇళ్లన్నింటిపై హనుమాన్ జెండాను ఎగురవేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
ఇప్పటికే పలు గ్రామాల ఇళ్ల మీద హనుమాన్ జెండా రెపరెపలాడుతున్నాయని, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు అన్ని ఇళ్లపైనా బీజేపీ జెండా ఎగురవేయాలని బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రతి ఇంటి మీద హనుమాన్ జెండా ఎగిరేలా చర్యలు తీసుకుంటున్నది. బీజేపీ నేతల బృందం కెరగోడు గ్రామాన్ని సందర్శించి లాఠీచార్జిలో గాయపడిన వారి ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఈ హనుమాన్ జెండా ఉద్యమం తదుపరి చర్యలను ప్లాన్ చేయడానికి గ్రామ నాయకులు, పంచాయతీ సభ్యులతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహించారు. మండ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఇంద్రేష్, నాయకులు అశోక్ జయరామ్ మరియు ఇతరులతో కూడిన బీజేపీ ప్రతినిధి బృందం పలు గ్రామాల్లో పర్యటించింది. ఆ సందర్బంలో కాంగ్రెస్ నాయకుల ప్రచార సామాగ్రిని ధ్వంసం చేసినందుకు ఆ కేసుకు సంబంధించి విచారణ చెయ్యడానికి తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని పోలీసులు తీసుకెళ్లారని బీజేపీ నాయకులు విమర్శించారు.
బీజేపీ నాయకుల బృందం ఆ బాలుడి ఇంటికి చేరుకోగానే అతని తండ్రి పాపన్న ఇంటి తలుపులు మూసివేసి మా కుటుంబానికి రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పి బీజేపీ నాయకులను వెళ్లిపోవాలని మనవి చేశారు. ఈ సందర్భంగా మండ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఇంద్రేష్ మాట్లాడుతూ బాలుడి కుటుంబానికి మేము అండగ ఉంటామని హామీ ఇచ్చారు. అమాయకులైన గ్రామస్తులను పోలీసులు భయాందోళనలు గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

మండ్య జిల్లాలో ఇటీవల హనుమాన్ జెండాలను కిందకు దించేసి ఆ జెండాలకు హానికలిగించడంతో పెద్ద వివాదం మొదలైయ్యింది. హనుమాన్ జెండాలకు హానికలిగించిన నిందితులకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు అండగా ఉంటున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. మండ్య జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పుడు ప్రతి ఇంటి మీద హనుమాన్ జెండా ఎగరవేయాలని బీజేపీ నాయకులు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications