బీజేపీ కాన్యాయ్ పై మావోయిస్టుల బాంబుదాడి. ఎమ్మెల్యే సహ ఐదుగురు పోలీసుల మృతి.
రాయ్‌పూర్ : మరో 36 గంటల్లో తొలివిడత పోలింగ్ జరుగుతోండగా ... అదనుచూసి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఛత్తీస్‌ఘడ్‌లో బీజేపీ నేతల కాన్వాయ్ లక్ష్యంగా ఐఈడీ బాంబు పేల్చారు. పేలుడులో బీజేపీ ఎమ్మెల్యే భిమా మాండవి, సహా ఐదుగురు భద్రతా సిబ్బంది నెలకొరిగారు.
మావోల మెరుపుదాడి
ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి వస్తోండగా మావోయిస్టులు మృత్యవు కబళించింది. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి, ఇతర నేతలతో కలిసి ప్రచారం నిర్వహించి తిరిగి వస్తున్నారు. క్వాకొండా పోలిస్ స్టేషన్ పరిధిలోని శ్యాంగిరి వద్ద మావోయిస్టులు ఐఈడీ బాంబును పేల్చారు. కాన్వాయ్‌లో ఎమ్మెల్యే వాహనం చివరిదని తెలుస్తోంది.

పేలుడుధాటికి వాహనం తునతునాకలైంది. ఎమ్మెల్యే సహా ఐదుగురు పోలీసులు చనిపోయారు. మావోయిస్టులు పేలుడుతో ఘటనాస్థలానికి సీఆర్పీఎఫ్ బలగాలను పంపించినట్టు అధికారులు తెలిపారు. కడపటి వార్త అందేసరికి మావోయిస్టులకు భద్రతాసిబ్బంది మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications