'నిజాలు తెల్సుకోండి': కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హత్యలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో మత అసహనం పెరిగిందంటూ పలువురు సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అవార్డు వాపసీపై 'నిజం తెలుసుకోండి' అంటూ ఓ పుస్తకం తీసుకు వచ్చింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడారు.

ప్రధాని మోడీ సారథ్యంలో పరుగులు పెడుతున్న ప్రగతి రథాన్ని పట్టాలు తప్పించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అవార్డు వాపస్ పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో కలిసి వెంకయ్య 'నిజం తెలుసుకోండి' పుస్తకం విడుదల చేశారు.

ఈ పుస్తకం అవార్డుల వాపస్ అసలు కథను బట్టబయలు చేస్తుందన్నారు. రాజు తప్పు చేయడు అనే పద్ధతుల్లో కాంగ్రెస్ పాలన సాగిపోయిందని, ఇప్పటి దాకా ఎవరికీ పట్టని ఆ రెండో కోణాన్ని ఈ పుస్తకం వివరిస్తుందని వెంకయ్య అన్నారు.

BJP releases 'Know The Trust' book on Award Wapsi

ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచిన మేధావులు

అసహనం పెరుగుతోందనే వాదనను కొట్టిపారేస్తూ పలువురు రచయితలు, విద్యావేత్తలు, చిత్రకారుల బృందం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. లోకసభ ఎన్నికల్లో మోడీ విజయంతో కొందరు దిగులు చెందారని, వారి వైఫల్యాన్ని ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు.

భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షుడు లోకేష్‌ చంద్ర, రచయిత ఎస్‌ఎల్‌ భైరప్ప, కపిల్‌ కపూర్, దిలీప్‌ కే చక్రవర్తి, కే గోపీనాథ్‌తో పాటు 36 మంది మేధావులు బిజెపి ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

గత కొంత కాలంగా పలువురు మేధావులు సమాజంలో అసహనం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారని, ఇలాంటి వారు కాంగ్రెస్‌, మార్స్కిస్టులు, లెనినిస్టులు, మావోయిస్టులను భుజాలపై మోసిన వారేనన్నారు.దాద్రీ లాంటి ఘటనల్లో కేంద్రాన్ని నిందించడం తగదన్నారు. హేతువాదుల హత్యలన్ని కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో జరిగాయని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+