గుజరాత్ లో కమల వికాసమే, ప్రతిపక్షంలోనే కాంగ్రెస్, క్లారిటీ ఇచ్చిన ఏబీపీ-సీఎస్ డీఎస్ సర్వే !

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: గుజరాత్ లో మరో సారి కమలమే వికసిస్తుందని ఏబీపీ-సీఎస్ డీఎస్ సర్వే స్పష్టం చేసింది. గుజరాత్ లో సుధీర్ఘకాలం తరువాత అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రతిపక్షంలోనే కుర్చోవలసి వస్తోందని సర్వే ప్రకటించింది.

GST at 5% Only In All Restaurants | Oneindia Telugu

గుజరాత్ లో మొదటి సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో బీజేపీకి సీట్లు, ఓటు శాతం తగ్గే అవకాశం ఉందని వెలుగు చూసింది. ఏబీపీ-సీఎస్ డీఎస్ సర్వే అంచనాల మేరకు బీజేపీకి 113 నుంచి 121 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 64 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది.

BjP set win Gujarat Assembbly elections 2017

బీజేపీకి 47 శాతం, కాంగ్రెస్ కు 41 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేస్తోంది. గత సర్వేతో పోలిస్తే బీజేపీకి 11 శాతం ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్ కు 12 శాతం ఓట్ షేర్ పేరిగింది. మధ్య, దక్షిణ గుజరాత్ లో బీజేపీ పూర్తి మోజారీ స్థానాలు సాధించనుంది. ఉత్తర గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకుంది.

సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఉండే అవకాశం ఉందని సర్వే తెలిపింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో మొత్తం 107 శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. మొత్తం మీద మరోసారి గుజరాత్ లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వేలో వెలుగు చూడటంతో కమలనాథులు సంబరపడిపోతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BjP set win Gujarat Assembbly elections 2017.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి