వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపుర ఎన్నికల్లో బీజేపీ జోరు: అగర్తాల సహా పలు మున్సిపాలిటీలు క్వీన్‌స్వీప్, టీఎంసీకి భారీ షాక్

|
Google Oneindia TeluguNews

అగర్తాల: త్రిపురలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ జోరు కొనసాగింది. రాష్ట్రంలోని అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 334 స్థానాలు, 13 మునిసిపల్ బాడీలు, ఆరు నగర పంచాయతీలకు కాషాయ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది, ఇక్కడ దాని నామినీలు 112 స్థానాల్లో పోటీ లేకుండా గెలుపొందారు. నవంబర్ 25న 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

అగర్తాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ క్లీన్‌స్వీప్

అగర్తాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ క్లీన్‌స్వీప్

త్రిపుర రాజధాని అగర్తాల మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ)లో మొత్తం 51 స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది బీజేపీ. ఇక రాష్ట్రంలో జరిగిన మరికొన్ని మున్సిపాలిటీల్లోనూ విజయబావుటా ఎగురవేసింది. ఇక ప్రతిపక్షాలైన టీఎంసీ, సీపీఎం ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం. ఖోవల్ మున్సిపల్ కౌన్సిల్ లోనూ మొత్తం 15 వార్డులలోనే బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు.

ఇతర మున్సిపాలిటీల్లోనూ బీజేపీదే హవా

ఇతర మున్సిపాలిటీల్లోనూ బీజేపీదే హవా

బెలోనియా మున్సిపల్ కౌన్సిల్‌లోనూ 17 సీట్లను సాధించింది. కుమరఘాట్ మున్సిపల్ కౌన్సిల్ లో 15 స్థానాలను దక్కించుకుంది. సబ్రూమ్ నగర్ పంచాయతీలో 9 సభ్యులు గెలుపొందారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు తెలిపారు. ధర్మానగర్ మున్సిపల్ కౌన్సిల్‌లో మొత్తం 25 వార్డులను గెలుచుకుని బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. తెలియముర మున్సిపల్ కౌన్సిల్‌లో 15 సీట్లను, అమర్పూర్ నగర్ పంచాయతీలో 13 మంది బీజేపీ సభ్యులు గెలుపొందారని తెలిపారు. .

సత్తా చాటిన బీజేపీ.. వెనకబడ్డ టీఎంసీ, సీపీఎం

సత్తా చాటిన బీజేపీ.. వెనకబడ్డ టీఎంసీ, సీపీఎం

సోనమురనగర్ పంచాయతీ, మేలఘర్ నగర్ పంచాయతీల్లో ప్రతిపక్షం లేకుండా పోయింది. ఈ రెండింటిల్లోనూ 13 చొప్పున స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

జిరనియా నగర్ పంచాయతీలోనూ 11 సభ్యులు బీజేపీవారే గెలిచారు. అంబాస మున్సిపల్ కౌన్సిల్ లో బీజేపీ 12 సీట్లను గెలుచుకోగా, టీఎంసీ, సీపీఎంలు చెరో స్థానం దక్కించుకున్నాయి. మరో స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.
కైలాష్ నగర్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ 16 సీట్లను కైవసం చేసుకుంది. సీపీఎంకు ఒక స్థానం దక్కింది. పనిసాగర్ నగర్ పంచాయతీలో బీజేపీ 12 సీట్లను గెల్చుకుంది. సీపీఎం ఒక స్థానంలో గెల్చింది.

Recommended Video

Kangana Ranaut బోల్డ్ పోస్ట్... అరెస్టు చెయ్యడానికి వస్తే నా మూడ్ ఇలా ఉంటుంది...! | Oneindia Telugu
టీఎంసీకి భారీ షాకిచ్చిన ఫలితాలు

టీఎంసీకి భారీ షాకిచ్చిన ఫలితాలు

మొత్తం 334 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. అధికార బీజేపీ 329 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం.ఈ ఎన్నికలను అధికార బీజేపీ, ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఎంసీ ఈశాన్య, ఇతర ప్రాంతాలలో తమను తాము జాతీయ పార్టీగా స్థాపించడానికి ప్రయత్నిస్తోంది. అయితే, త్రిపురలో మాత్రం టీఎంసీకి భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక రాష్ట్రంలో సీపీఎంకు అధికారం దూరం చేసిన కాషాయ పార్టీ.. తాజా ఎన్నికల్లోనూ షాకిచ్చింది. కాగా, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని టీఎంసీ, సీపీఎం డిమాండ్ చేస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ, టీఎంసీల మధ్య ఘర్షలు జరిగాయి.

English summary
BJP Sweeps Civic Body Elections In Tripura, Wins All Seats Of 51-Member AMC, TMC, CPI(M) failed to open their account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X