దీదీ కాలుకి గాయం.. వీడియో మీమ్స్.. బీజేపీ- టీఎంసీ మధ్య వార్
బెంగాల్ ప్రచారం హీటెక్కింది. బీజేపీ- టీఎంసీ మధ్య వార్ జరుగుతోంది. అయితే ఇటీవల మమతా బెనర్జీ గాయపడ్డ సంగతి తెలిసిందే. దానిపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఒక కాలుకు దెబ్బ తగిలితే మరో కాలుకు పట్టి వేసుకోవడంతో నవ్వుల పాలయ్యారు. దీనికి సంబంధించి బీజేపీ మీమ్స్ కూడా తయారు చేసింది.

సానుభూతితో బెంగాల్‌లో విజయం సాధించాలని దీదీ చూస్తున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి వీడియోను రూపొందించారు. దానిని బీజేపీ శ్రేణులు షేర్ చేస్తున్నారు. ఆమె కాలు ఊపే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
దీదీని విమర్శించడంపై టీఎంసీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఇదేంటి అని ఫైర్ అవుతున్నారు. తమ సీఎంను అవమానించడం ఏంటీ అని విరుచుకుపడ్డారు. ఈ మేరకు మంత్రి శశి పంజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ చేస్తోన్న ఆరోపణలను టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications