నయా పంజాబ్ నిర్మిస్తాం: అందుకు తమ వద్ద ప్రణాళిక ఉంది: ప్రధాని మోడీ
ఎన్నికల సమయం సమీపిస్తోన్న వేళ.. ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. పంజాబ్‌పై ముఖ్య నేతల కన్ను పడింది. బీజేపీ లక్ష్యం కొత్త పంజాబ్ నిర్మాణం చేయడమేనని ప్రధాని మోడీ అన్నారు. అందుకోసం తమకు దూరదృష్టి ఉందని చెప్పారు. ఇవాళ ఆయన వర్చువల్‌గా ప్రజలతో మాట్లాడారు. త్వరలో తాను పంజాబ్ పర్యటనకు వస్తానని చెప్పారు.
పనిలో పనిగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కర్తార్ పూర్ కారిడార్‌ను దేశంలో ఉంచడంలో కాగ్రెస్ పార్టీ విఫలమైందని కామెంట్ చేశారు. తమ లక్ష్యం మాత్రం కొత్త పంజాబ్ నిర్మాణమేనని.. సరిహద్దు ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తామని తెలిపారు. ఇవాళ ఆయన లుదియానా, ఫతెగడ్ సాహిబ్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో గల 18 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఇందుకోసం పార్టీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది. మోడీ వర్చువల్ ర్యాలీకి 50 వేల మంది హాజరయ్యారు. మరికొద్దీ రోజులు ర్యాలీల సంఖ్య పెంచుతామని బీజేపీ పేర్కొంది.

జనవరి 5వ తేదీన మోడీ పంజాబ్ వెళ్లిన సంగతి తెలిసిందే. అభివృద్ది పనులకు శంకుస్తాపన చేసి వెనుదిరిగారు. మోడీ కాన్వాయ్ ప్లై ఓవర్ మీద ఆగడంతో ఢిల్లీ బయల్దేరిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సారి వర్చువల్‌గా మాట్లాడారు.
ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ ప్రకటన చేసింది.












Click it and Unblock the Notifications