వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో బీజేపీ యువ కార్యకర్త హత్య.. మత కోణం ఆరోపణలు.. కంగనా ట్వీట్, కొట్టిపారేసిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని మంగోల్‌పురిలో యువ బీజేపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. బర్త్ డే పార్టీలో తలెత్తిన వివాదం ఘర్షణగా మారి హత్యకు దారితీసింది. మృతుడిని రింకు శర్మగా గుర్తించిన పోలీసులు అతను బీజేపీ యువ మోర్చా,విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ)లో క్రియాశీలకంగా ఉన్నట్లు గుర్తించారు.

వివరాల్లోకి వెళ్తే... బీజేపీ యువ మోర్చా కార్యకర్త రింకు శర్మ(25) ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగోల్‌పురిలో అతని నివాసం. స్నేహితుడు డానిష్‌తో కలిసి రింకు గురువారం(ఫిబ్రవరి 11) రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. పార్టీలో ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం తలెత్తింది. పార్టీ అనంతరం రింకు తన ఇంటికి వెళ్తుండగా... డానిష్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అతన్ని అడ్డగించాడు.

BJP Worker Rinku Sharma Murder: Delhi Police Say Business Rivalry Behind Death

ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన డానిష్,అతని స్నేహితులు రింకు శర్మను కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడ్డ రింకు శర్మ స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రి వద్దకు పరిగెత్తినప్పటికీ... గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొద్దిసేపటికే మృతి చెందాడు.

హత్యపై అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధాన్షు మాట్లాడుతూ.. రింకు,డానిష్ ఇద్దరూ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారని.. ఇద్దరూ స్నేహితులేనని చెప్పారు.ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఇద్దరూ కలిసి గతేడాది ఫుట్ బిజినెస్ ప్రారంభించారని... కానీ నష్టాలు రావడంతో మూసేశారని తెలిపారు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని... బర్త్ డే పార్టీలోనూ దీనిపైనే ఇద్దరూ గొడవపడ్డారని చెప్పారు. ఇదే క్రమంలో డానిష్ అతని స్నేహితులతో కలిసి రింకు శర్మను హత్య చేశాడన్నారు.

మరోవైపు మృతుడు రింకు శర్మ కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. కొద్దిరోజులుగా అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం రింకు విరాళాలు వసూలు చేస్తున్నాడని చెప్పారు. గురువారం రాత్రి బర్త్ డే పార్టీ సందర్భంగా అతను జై శ్రీరామ్ నినాదాలు చేశాడని.. దాన్ని వ్యతిరేకిస్తూ అతనిపై కొంతమంది దాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్ కూడా ఇవే ఆరోపణలు చేసింది. పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కూడా ఈ హత్యపై స్పందించారు. #JusticeForRinkuSharma అని ఆమె ట్వీట్ చేశారు.

English summary
A 25-year-old man, who was a BJP worker was assaulted and stabbed to death by a group of 4 people at a birthday party in Delhi's Mangolpuri late on Wednesday night. According to PTI, the deceased, identified as Rinku Sharma, got into a heated argument with the four men at a birthday party on Wednesday night. The four accused later went to the victim's house and stabbed him with a knife,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X