ఇక్కడి నుంచి బీజేపీ పతనం మొదలైయ్యింది, మోదీ పవర్ బాగా తగ్గింది, సీఎం కామెంట్స్ !
బెంగళూరు: ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ప్రశాంతత, శాంతిభద్రతలతో రాష్ట్రంలో శాంతిని నిర్మిస్తారనే నమ్మకంతోనే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. శాసనమండలిలో సిద్దరామయ్య మాట్లాడారు. కర్ణాటక రాష్ట్ర ప్రజలు బీజేపీని ఎన్నడూ ఆశీర్వదించలేదన్నారు. ఎప్పుడు బ్యాక్ డోర్ రాజకీయాలు చేసిన బీజేపీ ఆపరేషన్ కమలాతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీని రోడ్ షో చేయ్యాలని బీజేపీ నాయకులు ఆహ్వానించారని, నరేంద్ర మోదీకి ఓటు వెయ్యాలని బీజేపీ నాయకులు చెప్పినా ప్రజలు ఓట్లు వేయలేదని సిద్దరామయ్య ఆరోపించారు. ఇకపై ప్రధాని నరేంద్ర మోదీపై ఆధారపడటం వలన ఎలాంటి ఫలితం ఉందని, ఆయన ఎక్కడికి వెళ్లినా బీజేపీ ఓడిపోతున్నదని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.

1980లో జనతా లోక్‌దళ్ నుంచి లోక్‌సభ అభ్యర్థిని. ఆ సందర్భంగా మంజునాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తానని చెప్పారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ వస్తారు అని చెప్పి ఎన్నికల్లో గెలిచి వారని, అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి కూడా పేరు వచ్చింది. కానీ ఇప్పుడు మోదీ పవర్ మసకబారుతోందని సిద్దరామయ్య అన్నారు.
ప్రధాని మోదీ జనాదరణ పొందిన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు, కానీ అది ఇప్పుడు మసకబారుతోంది. పైనున్న వారు కిందకు దిగిరావాలి, కింద ఉన్నవారు పైకి రావాలి అని సిద్దరామయ్య అన్నారు. కర్ణాటక నుండే బీజేపీ పతనం మొదలైందని, దేశంలో ఇక ముందు బీజేపీని ప్రజలు ఆదరించరని సిద్దరామయ్య వ్యంగంగా అన్నారు.
మేము అన్ని మతాలు, కులాలు మరియు ఆచారాలను గౌరవిస్తామని, అదే కాంగ్రెస్ లౌకికవాద సిద్ధాంతం. మనకు రాజ్యాంగం ఉంది కాబట్టి మనం రాజ్యాంగానికి తప్ప మరేదైనా తలవంచమని, భారతదేశంలో 142 కోట్ల మంది ఉన్నారని, వారంతా ఒక్కటే, మనమంతా భారతీయులమని సిద్దరామయ్య అన్నారు. అయితే బీజేపీ నాయకులు కులాలు, మతాలు అంటూ ప్రజలను విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు.












Click it and Unblock the Notifications