Haryana Polls: మహిళలకు నెలకు రూ 2,100 - రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌..!!

హర్యానాలో ఎన్నికల రాజకీయం పీక్ కు చేరింది. రెండు ప్రధాన పార్టీలు హోరా హోరీగా తలపడుతున్నాయి. ఎన్నికల హామీల్లోనూ నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తు్నాయి. హర్యానా ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. సాత్‌ వాదే పక్కే ఇరదే'పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను పార్టీ చీఫ్ ఖర్గే విడుదల చేశారు. దీనికి కౌంటర్ గా బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది.

బీజేపీ మేనిఫెస్టో
హర్యానాలో బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ హర్యానా ఓటర్లకు హామీలు గుప్పించింది. మేనిఫెస్టోలో పలు అంశాలను పార్టీ ప్రస్తావించింది. హర్యానాలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని, ఓబీసీ క్రీమిలేయర్ లిమిట్ ను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఏడు పథకాల అమలు చేస్తామని ప్రకటించింది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.

BJP s manifesto for the Haryana Assembly elections promises Rs 2100 monthly for women

కొత్త పథకాలతో
కాంగ్రెస్ కు కౌంటర్ గా బీజేపీ తమ మేనిఫెస్టోలో ఆకర్షణీయ పథకాలను ప్రకటించింది.లడో లక్ష్మీ యోజన పథకం కింద మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తామని హామీ ఇచ్చింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని, హర్‌ ఘర్‌ గృహిణి యోజన కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన ప్రతీ అగ్నివీర్‌కు కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని పేర్కొంది. సంకల్ప పత్ర పేరిట రోహ్‌తక్‌లో ఈ మేనిఫెస్టోను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.

మహిళా ఓట్లపై గురి
హరియాణాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు దేశంలోని ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ ఇంజనీరింగ్‌ లేదా వైద్య విద్య అభ్యసించినా వారికి స్కాలర్‌షిప్స్‌ అందిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అదే విధంగా.. 24 పంటలకు కనీస మద్దతు ధర కల్పనకు కట్టుబడి ఉన్నామని చెప్పింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల ఇళ్లు నిర్మాణం..ఇండస్ట్రియల్ మోడల్ టౌన్‌షిప్ ఖర్ఖోడా తరహాలో పది పారిశ్రామిక నగరాలను నిర్మాణం చేపతామని హామీ ఇచ్చింది. హరియాణాకు చెందిన బలహీన వర్గాలు, ఎస్సీ-ఎస్టీ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీలతో ఏ స్థాయిలో ఓట్లు దక్కుతాయనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+