వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమేథీ: ఎఎపి నేత కాన్వాయ్‌పై రాళ్లు, పారిపోనని వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో/న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేత కుమార్ విశ్వాస్ వాహన శ్రేణి పైన గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. 2014 లోకసభ ఎన్నికల కోసం ఉత్తర ప్రదేశ్‌లో ఎఎపిని సమాయత్తం చేసేందుకు విశ్వాస్ ఆదివారం అమేథీలో జన్ విశ్వాస్ ర్యాలీని చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ పోరాటం రాచరికం, అవినీతి పైన అన్నారు. తాను సామాన్యుడినైతే, అమేథీ నుండి పోటీ చేసే రాహుల్ గాంధీ యువరాజు అన్నారు. తమకు గెలుపు, ఓటములు ముఖ్యం కాదని, వ్యవస్థలో నెలకొన్న అసాంఘిక పరిణామాలు పెలికివేయడమే లక్ష్యమన్నారు. ఆయన తన మాటల్లో సోనియా, రాహుల్ కుటుంబాన్ని విమర్శించారు.

Kumar Vishwas

పార్లమెంటులో రాహుల్ ఇప్పటి వరకు ఒక్క ప్రశ్న కూడా అడగలేదని ఆరోపించారు. సోనియా గాంధీ చికిత్స కోసం విదేశాలకు ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. దళితుల ఇంటిలో భోజనం చేసిన రాహుల్ గాంధీ విషయమై మాట్లాడుతూ.. కేవలం వారింట్లో తినడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. తన నియోజకవర్గంలో ఉన్న వారికి మంచి భోజనాన్ని అందించాలన్నారు.

కాగా, కుమార్ విశ్వాస్‌కు అమేథీలో మాట్లాడుతుండగా పలువురు నల్ల జెండాలు ప్రదర్శించారు. తనకు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయడంపై విశ్వాస్ స్పందిస్తూ... నల్ల జెండాలతో తన ఎదుట ప్రదర్శన చేస్తే తాను ఇక్కడి నుండి పారిపోతానని అనుకుంటే తప్పవుతుందన్నారు. ఆయన కాన్వాయ్ పైన పలువురు రాళ్లు వేశారు.

English summary

 Black flags were shown to Aam Aadmi Party (AAP) leader Kumar Vishwas as his convoy passed through Jadishpur on way to Amethi, where he is scheduled to address a rally on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X