కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ: అశోక్ అగర్వాల్ రాజీనామా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అశోక్ అగర్వాల్ మంగళవారంనాడు పార్టీకి రాజీనామా చేశారు.
తాను రాజీనామా చేసిన విషయాన్ని అశోక్ అగర్వాల్ ధ్రువీకరించారు. జాతీయ కార్యవర్గ పదవికి, ఇతర పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. టికెట్ల పంపిణీ తీరు పట్ల తాను అసంతృప్తికి గురైనట్లు ఆయన చెప్పారు. పైవర్గానికి మాత్రమే టికెట్లు ఇచ్చి సామాన్యులను వదిలేశారని ఆయన ఆరోపించారు.

చండీఘర్ లోకసభ సీటు నుంచి పోటీ చేయడానికి హాస్యనటుడు జస్పాల్ భట్టి భార్య సవితా భట్టీ పోటీ చేయడానికి నిరాకరించిన నేపథ్యంలో అశోక్ అగర్వాల్ రాజీనామా చేశారు. రానున్న లోకసభ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 30 మందితో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో మహాత్మా గాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ, మాజీ బిజెపి ఎంపి రజన్ సుశాంత్ ఉన్నారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల మొదటి జాబితాలో బ్యాంకర్ మీరా సన్యాల్, సామాజిక కార్యకర్త మయాంక్ గాంధీ ఉన్నారు.












Click it and Unblock the Notifications