నవవధువు కిడ్నాప్: అడ్డుకున్న చిన్నాన్న హత్య
చెన్నై: కొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుందనగా నవ వధువును గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆగంతకులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వధువు చిన్నాన్న ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని వేలూరు జిల్లా వాలాజ గాంధీనగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్‌కు చెందిన ఆరుముగం(40) తిరువణ్ణామలైలోని గిరివలయం రోడ్డులో ఫర్నీచర్ దుకాణం నడుపుతున్నాడు. అతని కుమార్తె లావణ్య తిరువణ్ణామలైలోని తాత ఇంటిలో ఉంటూ బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
తిరువణ్ణామలైలోని కణ్ణన్ కుమారుడు, ఆటోడ్రైవర్ కార్తీక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో కార్తీక్ ఆమె వెంటపడేవాడు. లావణ్య తల్లిదండ్రులు తిరువణ్ణామలై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కార్తీక్‌ను పిలిచి హెచ్చరించి వదిలేశారు.

ఈ నేపథ్యంలో లావణ్యకు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయించారు. లావణ్యను తిరువణ్ణామలై నుంచి వాలాజకు తీసుకొచ్చి ఇంటిలో పెట్టి తాళం వేశారు. కార్తీక్ తిరువణ్ణామలైలోని అతని స్నేహితులు ముగ్గురిని తీసుకొని కారులో లావణ్య ఇంటి వద్దకు వచ్చి సినీ పక్కీలో ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు.
గమనించిన లావణ్య చిన్నాన శివకుమార్(35) అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కొంత వరకు బైకుపై వెంబడించి, కారు స్లో కాగానే ఆ కారు వెనుక వైపు ఎక్కాడు. కొద్దిదూరం వెళ్లాక జాతీయ రహదారి రాగానే శివకుమార్ కారులో ఎక్కేందుకు ప్రయత్నించాడు. దీంతో కారులోని దుండగులు శివకుమార్‌ను కారు నుంచి కిందకు తోశారు.
తీవ్రగాయాలపాలైన శివకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వాలాజ పోలీసులు కేసు నమోదు చేసి, కార్తీక్‌తో పాటు అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications