వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఎన్నికలపై బుకీల అంచనా ఏంటి?: రూ.3వేల కోట్ల బెట్టింగ్..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు కర్ణాటక ఎన్నికల పైనే ఉంది. మే 12న జరిగే ఫలితాల్లో కాంగ్రెస్ తిరిగి అధికారాన్ని నిలుపుకుంటుందా?.. లేక కాషాయ పార్టీ ఖాతాలో మరో రాష్ట్రం చేరుతుందా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

గెలుపు ఓటములపై విశ్లేషణల సంగతి పక్కనపెడితే.. ఈ పొలిటికల్ హీట్ పందెంరాయుళ్లకు కలిసొచ్చేలా మారింది. దీన్ని అదునుగా చేసుకుని లక్షల్లో బెట్టింగులు కాస్తున్నారు పందెంరాయుళ్లు. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో బెట్టింగ్ జోరు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

కోట్లలో బెట్టింగ్:

కోట్లలో బెట్టింగ్:

లక్షల్లో పందేలు కాస్తుండటంతో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారుతున్నట్టు సమాచారం. నియోజకవర్గం, అభ్యర్థిని బట్టి రూ.20 లక్షలతో మొదలుకుని రూ.50 లక్షల వరకు పందెం కాస్తున్నారట. ఇందులోనూ ఎక్కువమంది బీజేపీ ఓడిపోతుందనే బెట్టింగ్ కడుతున్నారట.

బీజేపీపై ఓ వ్యక్తి 50లక్షల బెట్టింగ్:

బీజేపీపై ఓ వ్యక్తి 50లక్షల బెట్టింగ్:


బీజేపీ కంటే కాంగ్రెస్‌కు ఐదు స్థానాలు ఎక్కువ వస్తాయని ఒకరు రూ.20 లక్షలు పందెం కట్టినట్టు సమాచారం. అలాగే బీజేపీకి 115 స్థానాలకు ఒక్క సీటు కూడా మించదని మరో వ్యక్తి రూ.50లక్షలు పందెం కాసినట్టు తెలుస్తోంది. సీఎం అభ్యర్థి సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి అభ్యర్థి శ్రీరాములు పైనా జోరుగా బెట్టింగ్స్ పెడుతున్నారట. బళ్లారి నియోజకవర్గం పైనే ఎక్కువమంది బెట్టింగ్ కాసినట్టు కూడా చెబుతున్నారు.

ఎన్నికలపై బుకీల మాట:

ఎన్నికలపై బుకీల మాట:

కర్ణాటక ఎన్నికల బెట్టింగ్ పై జాతీయ మీడియా కొంతమంది బుకీలను సంప్రదించింది. ఈ సందర్భంగా వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్నికల్లో హంగ్ తప్పదని, అయితే కాంగ్రెస్, బీజేపీలు రెండూ మెజారిటీకి దగ్గరగా వస్తాయని అంటున్నారు. ఇండిపెండెంట్స్, జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తాయని చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికలపై ముంబై, ఢిల్లీ, ప్రాంతాల నుంచి జోరుగా బెట్టింగ్ జరుగుతోందని, మొత్తంగా రూ.3వేల కోట్ల బెట్టింగ్ జరుగుతోందని ఓ బుకీ వెల్లడించడం గమనార్హం.

Recommended Video

Karnataka Elections 2018 : Bjp Will Win Karnataka Elections : Survey
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ:

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ:

బుకీలు చెబుతున్న ప్రకారం.. కర్ణాటకలో కాంగ్రెస్ కంటే బీజేపీ ఒకటి రెండు స్థానాలు ఎక్కువగా గెలుచుకోనుందట. కాంగ్రెస్ 80-92వరకు స్థానాలను గెలుచుకుంటే, బీజేపీ 93-95స్థానాలను గెలుచుకోనుందట. అయితే బుకీల మాటను కొట్టిపారేస్తున్నవాళ్లు కూడా లేకపోలేదు. ఇకపోతే ఇండియాలో బెట్టింగ్ అక్రమం అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇలాంటివి కామన్ అయిపోయాయి అంటున్నారు.

English summary
Bookmakers, who spoke to Media Ketan Joshi on condition of anonymity, said there is a Rs 3,000 crore betting business associated with the Karnataka assembly elections. According to bookmakers from Mumbai,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X