ఉగ్రదాడి, వీరమరణం, రాకీ అంత్యక్రియలు
హర్యానా: పాకిస్థాన్ కు చెందిన లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదుల చేతిలో వీరమరణం పోందిన భారత్ సెక్యూరిటి ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను రాకీ అలియాస్ రాక్ ఫోర్స్ రాకీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంచనాలతో ఆయన స్వగ్రామంలో నిర్వహించారు. కన్నీటితో రాకీకి తుది విడ్కోలు పలికారు.
హర్యానా రాష్ట్రంలోని రాకీ స్వగ్రామం అయిన రామ్ గర్ మజ్రాలో అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం అంత్యక్రియలకు ముందుగా బీఎస్ఎఫ్ అధికారులు, స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు, బంధువులు రాకీ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇటివలే రాకీ బీఎస్ఎఫ్ లో జవానుగా చేరాడు. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని ఉదమ్ పూర్ లో ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో ఎదురు కాల్పులకు దిగిన రాకీకి బుల్లెట్ గాయాలైనాయి, తన శరీరంలోకి తుపాకి బుల్లెట్ లు దూసుకు వెళ్లినా అతను లెక్కచెయ్యలేదు.
సహచరుల ప్రాణాలు కాపాడటానికి శక్తి వంచనలేకుండ కృషి చేశాడు. తన తుపాకిలోని 40 బుల్లెట్ లను ఖాళీ చేసి ఉగ్రవాదిని అంతం చేశాడు. రాకీ పని చేస్తున్న యూనిట్ లో అతనిని సాటి జవాన్లు రాక్ ఫోర్స్ రాకీ అని పిలిచేవారు. పేరుకు తగ్గట్టుగానే రాకీ ఉగ్రవాదులతో పోరాటం చేసి వీరమరణం పోందాడు.












Click it and Unblock the Notifications