బలవంతంగా సున్తీ చేశారు...రాజస్థాన్‌లో కేసు పెట్టిన తల్లి
రాజస్థాన్ లో ఓ బాలునికి సున్తి చేసి బలవంతపు మత మార్పిడి చేశారని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీంతో పాటు బాలుడి తల్లిని చెల్లిని సైతం లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.

రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌లో బార్మర్ లో నివాసం ఉంటున్న ఫతేఖాన్ అనే వ్యక్తి తన 12 సంవత్సరాల కుమారునికి సున్తి చేసి బలవంతంగా మత మార్పిడి చేయించారని ఆరోపిస్తు ఓ మహిళ కేసు పెట్టింది. దీంతో పాటు గత కొద్ది నెలలుగా ఫతేఖాన్ 15 సంవత్సారాల కూతురుతోపాటు ఆమేను కూడ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కోంది. ఈ నేపథ్యంలోనే ఆమేకు రక్షణ కల్పించాలని పిటిషన్ లో తెలిపింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి విచారణ చేపడుతున్నట్టు పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ రాజ్ పురోహిత్ చెప్పారు.












Click it and Unblock the Notifications