వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ సంకేతాలు ఎవరివి? గ్రహాంతరవాసులవేనా? అప్పటికి భూమ్మీద మనమే లేమా?

ఎక్కడో 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరాన.. రోదసిలో ఉన్న ఒక కుబ్జ పాలపుంత నుంచి 15 రేడియో పేలుళ్ల సంకేతాలు! ఏమిటవి?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎక్కడో 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరాన.. రోదసిలో ఉన్న ఒక కుబ్జ పాలపుంత నుంచి 15 రేడియో పేలుళ్ల సంకేతాలు! ఏమిటవి? మనకన్నా తెలివైన గ్రహాంతరవాసులెవరో తమ వ్యోమనౌకలను స్టార్ట్‌ చేయడానికి ఉపయోగించిన అత్యంత శక్తిమంతమైన కాంతిపుంజాలేనా? అంటే.. అయ్యే అవకాశం ఉందంటున్నారు ఖగోళ శాస్త్రజ్ఞులు.

'బ్రేక్‌ త్రూ లిజన్‌' పేరిట గ్రహాంతరజీవుల కోసం 100 మిలియన్‌ డాలర్లతో చేపట్టిన అన్వేషణ ప్రాజెక్టులో భాగంగా.. భారత్‌కు చెందిన విశాల్‌ గజ్జర్‌ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు వెస్ట్‌ వర్జీనియాలోని గ్రీన్‌బ్యాంక్‌ టెలిస్కోపు ద్వారా జరిపిన ఐదు గంటల పరిశీలనలో ఈ రేడియో సంకేతాలను గుర్తించారు.

 Breakthrough Detects Repeating Fast Radio Bursts Coming from distant Galaxy

ఈ సంకేతాలు వెలువడినప్పుడు మన సౌరవ్యవస్థ వయసు 200 కోట్ల సంవత్సరాలని బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రాజెక్టు నిర్వాహకులు తెలిపారు. ఆ సమయానికి మన భూమ్మీద ఏక కణ జీవులు మాత్రమే ఉన్నాయని.. ఆ ఏక కణ జీవులు బహు కణ జీవులుగా పరిణామం చెందడానికి మరో 100 కోట్ల ఏళ్లు పట్టిందని వివరించారు.

నిజానికి ఈ ఫాస్ట్‌ రేడియో బరస్ట్స్‌ (ఎఫ్‌ఆర్‌బీ- రేడియో సంకేతాల)ను గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 2012 నవంబరు 2న ఆస్ట్రేలియాలో పార్క్స్‌ టెలిస్కోప్‌ ద్వారా వీటిని గుర్తించారు. ఆ రేడియో సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకపోయినా.. ఆ చోటుకు 'ఎఫ్‌ఆర్‌బీ 121102' అని పేరు పెట్టారు.

ఆ తర్వాత ఇది పదేపదే సంకేతాలు వెలువరిస్తున్నందున దీన్ని 'రిపీటర్‌'గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సంకేతాలు 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న డ్వార్ఫ్‌ గెలాక్సీ నుంచి వస్తున్నట్టు గత ఏడాదే గుర్తించారు. తాజాగా ఆగస్టు 26న విశాల్‌ గజ్జర్‌.. అక్కడి నుంచి వచ్చిన 15 బరస్ట్స్‌ గుర్తించారు. గతంతో పోలిస్తే వీటి తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువగా ఉందని బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ ఆండ్రూ సైమన్‌ తెలిపారు.

ఏమిటీ 'బ్రేక్‌ త్రూ లిజన్‌ ప్రాజెక్ట్‌'?

గ్రహాంతరజీవుల అన్వేషణ కోసం మార్క్‌ జుకెర్‌బెర్గ్‌, స్టీఫెన్‌ హాకింగ్‌, యూరీ మిల్నర్‌ రూ.640 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు ఇది. ప్రాజెక్టులో భాగంగా వారు వెస్ట్‌ వర్జీనియాలోని గ్రీన్‌ బ్యాంక్‌ రేడియో టెలిస్కోప్‌, హామిల్టన్‌ పర్వతంపై ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్‌ ప్లానెట్‌ ఫైండర్‌, ఆస్ట్రేలియాలోని పార్క్స్‌ రేడియో టెలిస్కోపును వినియోగించుకుంటున్నారు.

English summary
Using the Green Bank Radio Telescope in West Virginia, the Listen science team at UC Berkeley has been observing distant stars for over a year now. And less than a week ago, they observed 15 Fast Radio Bursts (FRBs) coming from a dwarf galaxy located three billion light-years away. According to a study that described their findings, this was the first time that repeating FRBs have been seen coming from this source at these frequencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X