భర్తను కొని కాపురం చెయ్యలేను: వధువు
తిరువనంతపురం: ఐదు లక్షలు వరకట్నం ఇచ్చి తాను భర్తను కొనుక్కొని కాపురం చెయ్యలేనని, మానవత్వ విలువలు తెలియన ఆ కుటుంబానికి తాను కోడలిగా వెళ్లాలనుకోవడం లేదని ఓ యువతి ధైర్యం చేసి చెప్పింది. నాకు ఈ పెళ్లి వద్దని అందరి ముందు చెప్పింది.
కేరళలోని త్రిశూర్ లో రమ్యా రామచంద్రన్ అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని నెలల క్రితం ఓ వ్యక్తితో రమ్యా రామచంద్రన్ నిశ్చితార్థం జరిగింది. ఆ సందర్బంలో అబ్బాయి కుటుంబ సభ్యులు వరకట్నం కావాలని డిమాండ్ చెయ్యలేదు.
నిశ్చితార్థం పూర్తి అయిన కొంత కాలానికి రూ. ఐదు లక్షలు వరకట్నం, బంగారు నగలు కావాలని డిమాండ్ చేశారు. పెళ్లిపీటల వరకు వచ్చిన తరువాత తమకు డబ్బు, బంగారం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని, లేదంటే లేదని తేల్చి చెప్పారు.

మొదటి నుంచి వరకట్నాన్ని వ్యతిరేకించే రమ్యా రామచంద్రన్ తను భర్తను, వారి కుటుంబ సభ్యులను కొనలేనని తేల్చి చెప్పింది. వరకట్నం ఇచ్చి కొనుక్కొన్న భర్తతో కాపురం చెయ్యలేనని కుటుంబ సభ్యులకు చెప్పింది.
మానవత్వ విలువలు లేని ఆ ఇంటికి కోడలిగా వెళ్లాలనుకోవడం లేదని బంధువులు, కుటుంబ సభ్యుల ముందు ధైర్యంగా చెప్పింది. మాటతప్పిన వారితో మాకు ఎలాంటి సంబంధం వద్దు అంటూ తేల్చి చెప్పింది.
తన పెళ్లి ఆగిపోయిందని, వరకట్నం కారణం అంటూ ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఇప్పుడు రమ్యా రామచంద్రన్ చేసిన పనికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. రమ్యా రామచంద్రన్ లాంటి ధైర్యవంతులు నేటి యువతులకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications