మగాడే కాదు: భర్తకు విడాకులిచ్చిన నవ వధువు
కోల్‌కతా: విడాకుల కోసం ఓ మహిళ తీవ్ర ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. తన భర్త మగాడే కాదని, అందువల్ల తనకు అతడి నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 18 ఏళ్ల యువతికి రెండు వారాల క్రితమే పెళ్లయింది. కొద్ది రోజుల తర్వాత ఆమె కుటుంబసభ్యులు కొంతమంది అల్లుడి ఇంటికి వెళ్లగా.. అప్పుడే వాళ్లలో కొందరికి అతగాడికి పుంసత్వ సమస్య ఉన్నట్లు తెలిసింది. కానీ, ఆ కొత్త పెళ్లికూతురు అప్పటికి ఏమీ చెప్పలేక ఊరుకుంది.
పుట్టింటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా భోరున విలపించింది. స్ట్రీట్ సర్వైవర్స్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు షబ్నమ్ రామస్వామి వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంది.

తన భర్త మగాడు కాదని, అందువల్ల అతడి నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. అంతేగాక, తాను పెళ్లి సమయంలో కట్నంగా ఇచ్చిన రూ. 55వేల నగదుతో పాటు రూ. 55 వేల విలువగల ఆస్తులను కూడా తిరిగి ఇప్పించాలని కోరింది.
ఇంతకుముందు కూడా తమ గ్రామంలో చాలామంది అమ్మాయిలు విడాకులు తీసుకున్నారని, కానీ ఏ ఒక్కరూ భర్తకు నపుంసత్వ సమస్య ఉందని ధైర్యంగా చెప్పలేకపోయారని ఆమె తెలిపింది. తనకు మాత్రం భయం లేదని చెప్పింది. కాగా, చివరకు కోర్టులో ఆమెకు విడాకులు మంజూరయ్యాయి.












Click it and Unblock the Notifications