కాన్పూర్: రైలు నుంచి పడి బ్రిటీష్ పౌరుడి మృతి
కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లోని చందారి సమీపంలో రైల్వే పట్టాలపై బుధవారం ఉదయం ఓ బ్రిటిష్ పౌరుడి(56) మృతదేహం లభ్యమైంది. కాన్పూర్ గుండా వెళుతున్న ఓ రైలులో ప్రయాణిస్తున్న అతడు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో అతని కాలు తెగిపడిపోయిందని చెప్పారు. మృతదేహం వద్ద అతని పాస్‌పోర్ట్ లభించిందని పోలీసులు తెలిపారు. పాస్‌పోర్ట్ వివరాల ప్రకారం అతడు బ్రిటీష్ పౌరుడిగా గుర్తించినట్లు చెప్పారు.
భవనం కూలి వృద్ధురాలి మృతి

బెంగళూరు: రెండస్తుల భవనం కూలిన ఘటనలో 80ఏళ్ల వృద్ధురాలు మృతి చెందాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తూర్పు బెంగళూరులోని లింగరాజపురంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి, కాగా, ఒక నెల చిన్నారి ఈ ప్రమాదం నుంచి బయటపడింది.
ఐదు దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ భవనం బీటలు వారడంతో కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జోసెఫ్ పాల్(47)తో పాటు భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో నివాసముంటున్న అతని తల్లి జో మేరీ భవనం కూలిన ఘటనలో మృతి చెందింది.
భవనం తొలి అంతస్తులో ఉన్న నిర్మల(37), ఆమె కొడుకు జోసెఫ్(12) తీవ్రగాయాలపాలయ్యారు. కాగా, ఆమె నెల రోజుల కూతురుకు మాత్రం ఈ ఘటనలో ఎలాంటి గాయాలుకాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనలో మృతి చెందిన వృద్ధురాలి కుటుంబసభ్యులకు రూ. 3 లక్షలు, గాయాలపాలైన వారికి రూ. 25వేల పరిహారాన్ని బిబిఎంపి ప్రకటించింది.












Click it and Unblock the Notifications