Cauvery water: ఇళ్లు దోచుకున్న తరువాత దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది, బీజేపీ !
బెంగళూరు: తమిళనాడుకు కావేరి నీళ్లు వదిలేసిన తరువాత ఇప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టడం సరికాదని కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్. యడియూరప్ప అన్నారు. కర్ణాటక రాష్ట్రం తరఫున ఆగస్టు 26వ తేదీన సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించాలని అఖిల పక్ష పార్టీ నాయకులు కర్ణాటక ప్రభుత్వానికి సూచించారు.
బుధవారం విధానసౌడలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ ఏ కారణం చేతనైనా కావేరి నీటిని విడుదల చేయలేమని కర్ణాటక ప్రభుత్వం తేల్చిచెప్పాలన్నారు. ఈ అఖిలపక్ష సమయం అనంతరం మాజీ సీఎం డీవీ. సదానందగౌడ మాట్లాడుతూ కావేరి నీటిని విడుదల చేసి అఖిలపక్ష సమావేశం పెట్టడం సరికాదని సిద్దరామయ్య ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించి న్యాయపరమైన చిక్కులు తొలగిపోయి ముందుకు సాగాలి. తమిళనాడులోని డ్యామ్‌ల నీటి సరఫరా, అక్కడి రైతుల వ్యవసాయ విధానాలు, మూడు పంటలు పండే తీరు గురించి వివరించారు. కర్ణాటకలోని మన రైతులు రెండు పంటలు మాత్రమే పండిస్తున్నారని సుప్రీంకోర్టుకు చెప్పాలని, తరువాత మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతులు పొందాలని మాజీ సీఎం సదానందగౌడ సిద్దరామయ్య ప్రభుత్వానికి సూచించారు.
మండ్య జిల్లాలో నీటిపారుదల సమావేశాని ఆ జిల్లా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎందుకు పిలవలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ప్రశ్నించారు. ఏఐసీసీ సమావేశంలో కర్ణాటక రైతులకు మినుము, బత్తాయి పండించమని చెప్పి తమిళనాడు రైతులకు కావేరి నీళ్లు ఇచ్చారా అని బీజేపీ నాయకులు సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.


అనంతరం మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో రెండు అంశాలు ఉన్నాయన్నారు. మహాదాయి సమస్యకు సంబంధించి గోవా ప్రభుత్వం అటవీశాఖ అధికారి ద్వారా అభ్యంతర పత్రాన్ని అందజేసిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ కట్టుబడి ఉందని బసవరాజ్ బోమ్మయ్ చెప్పారు.

ఇల్లు మొత్తం దోచుకున్న తరువాత దొంగ దొంగ అని అరిచినట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని ఆ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు విమర్శించారు. బుధవారం బెంగళూరులోని విదానసౌధలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీజేపీ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు బీఎస్ యడ్యూరప్ప, బసవరాజ్ బోమ్మయ్, డీవీ సదానంద్‌గౌడ్, జేడీఎస్ మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications