బీఎస్ఎఫ్ జవాను కాల్పులు: ఇద్దరు సహచరుల మృతి
కోల్‌కతా: ఓ బీఎస్ఎఫ్ జవాను ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపాడు. ఈ ఘటన మంగళవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పుర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ తర్వాత నిందితుడు అధికారుల వద్ద లొంగిపోయాడు.
ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులోని రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఓ ప్రాంతంలో బీఎస్ఎఫ్ క్యాంపు నడుస్తోంది. ఈ క్యాంపులో 146 బెటాలియన్‌కు చెందిన ఉత్తమ్ సూత్రధార్ అనే జవాను.. ఇన్స్పెక్టర్ మహిందర్ సింగ్ భట్టి, కానిస్టేబుల్ అనూజ్ కుమార్‌పై కాల్పులకు తెగబడ్డాడు.

ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా, కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఉత్తమ్ తమ కమాండర్ ఎదుట లొంగిపోయినట్లు రాయ్‌గంజ్ సూపరింటెండెంట్ సుమిత్ కుమార్ తెలిపారు.
ఈ కేసును రాయ్ గంజ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేసినట్లు, తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్పీ సుమిత్ వెల్లడించారు. అయితే, ఇద్దరు తోటి జవాన్లను ఉత్తమ్ ఎందుకు కాల్చి చంపాడనే విషయం ఇంకా తెలియరాలేదు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications