ఉత్తర్ ప్రదేశ్ లో బిఎస్ పి అభ్యర్థిపై గ్యాంగ్ రేప్ కేసు, రాజకీయ కుట్రేనా
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో బిఎస్ పి నాయకుడు బజ్మీ సిద్దిఖీపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు వచ్చాయి. సిద్దిఖీతో పాటు ఆయన ఆరుగురు అనుచరులపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.
అయోధ్య:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకుల ఇష్ట్యారాజ్యం కొనసాగుతోంది. బలమున్నవాడితే రాజ్యం అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తారు.ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి చెందిన మంత్రి గాయత్రి ప్రజాపతి గ్యాంగ్ రేప్ ఆరోపణలతో అదృశ్యమయ్యారు. మరో వైపు బిఎస్ పి నాయకుడు బజ్మీ సిద్దిఖిపై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య అసెంబ్లీ స్థానం నుండి బజ్మీ సిద్దీఖీ అనే వ్యక్తి బిఎస్ పి తరపున పోటీ చేశారు. సిద్దిఖీతో పాటు ఆయన ఆరుగురు అనుచరులు తనపై సామూహిక లైంగిక దాడికిపాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిఖీ ఐదుగురు అనుచరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సిద్దిఖీ, మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని సిద్దికీ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో బిఎస్ పి గాలి వీస్తోందని, అయోధ్యలో తాను విజయం సాధిస్తానని ప్రత్యర్థి పార్టీలు తనపై కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు.
శనివారం రాత్రి సిద్దిఖీ ఆయన అనుచరులు ఫైజాబాద్ లో తన ఇంట్లోకి బలవంతంగా వచ్చి దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను, తన కుటుంబ సభ్యులను చితకబాదారాని బాధితురాలు ఆరోపించింది.
మూడు నెలల క్రితం కూడ సిద్దిఖీ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. స్థానిక పోలీసుల సహకారంతో ఆయన కేసు నుండి తప్పించుకొన్నారని బాధితురాలు చెప్పింది, ఫైజాబాద్ , లక్నోలలో సిద్దిఖీపై పలు క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications