బుర్ద్వాన్: జెఎంబి ఉగ్రవాదికి ఆధార్, ఓటర్ కార్డు
ఢిల్లీ: తాను భారతీయుడినని నమ్మించేందుకు ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులను బుర్ద్వాన్ పేలుడుతో సంబంధం ఉన్న బంగ్లాదేశ్ ఉగ్రవాది తరీకుల్ ఇస్లాం పొందినట్లు అధికారులు తెలిపారు.
జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు గత వారం జార్ఖండ్‌లో ఇస్లాంను అదుపులోకి తీసుకున్నప్పటికీ బుర్ద్వాన్ పేలుడుతో తనకు సంబంధం లేదనే చెప్పాడు.

పేలుడు స్థలంలో ఎన్‌ఐఏ అధికారులు సేకరించిన వేలిముద్రలతో ఇస్లాం వేలిముద్రలు సరిపోలడంతో బంగ్లాదేశ్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)తో అతనికున్న సంబంధాలు వెల్లడించినట్లు పేర్కొన్నాయి.
కాగా, బంగ్లాదేశ్‌లో ఐదేళ్లు జైల్లో ఉన్న సమయంలో జేఎంబీ వ్యూహకర్త రహమతుల్లాతో పరిచయమైనట్లు ఇస్లాం విచారణలో వెల్లడించాడు.
పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో యువతకు మతబోధనలు చేసి వారి ద్వారా బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులకు పాల్పడి హసీనా సర్కారును అస్థిరపరిచే లక్ష్యంతో 2012లో భారత్‌లోకి ప్రవేశించాడు ఇస్లాం.












Click it and Unblock the Notifications