పొరపాటున ఈ కోచ్ లోకి వెళితే జరిమానా, జైలుశిక్ష
చవకైన, సురక్షితమైన రవాణా సాధనంగా భారతీయ రైల్వేలు పేరు తెచ్చుకున్నాయి. రైలులో ప్రయాణం చేసేటప్పుడు వాటి నియమ నిబంధనల గురించి మనం తెలుసుకుంటుండాలి. మనకు తెలియని విషయాలే ఎక్కువగా ఉంటాయి. అలాగే రైల్వే నియమ నిబంధనలు కూడా తెలుసుకోలేం. ప్రతిరోజు రైలులో ప్రయాణించేవారు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉంటారు. వారితో సహా ప్రయాణికులంతా కొన్ని విషయాలు తెలుసుకోలేకపోతే భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ప్రయాణం చేస్తూ పొరపాటున ఈ కంపార్ట్ మెంట్ లోకి వస్తే జరిమానా పడుతుంది. అదేమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రైలులో జనరల్, స్లీపర్, AC క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇవేవీ కాకుండా మరో కోచ్ కూడా రైలులో ఉంటుంది. అది.. ప్యాంట్రీకార్ కోచ్. చాలా ఖరీదైన కోచ్. దీనిలో ఎవరు పడితే వారు ప్రయాణం చేయడానికి వీల్లేదు. పొరపాటున వెళ్లినా కూడా జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా పడుతుంది. ప్రయాణికులెవరైనా ప్యాంట్రీకార్ లో ప్రయాణిస్తున్నట్లు టీసీ గుర్తిస్తే వెంటనే జరిమానా, జైలు శిక్ష రెండూ విధిస్తారు. వేడి పాలు, మంచినీటి కోసమైతే ఇక్కడకు వెళ్లవచ్చు.

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వేలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. ప్రయాణికులను సాధ్యమైనంత వేగంగా వారి గమ్యస్థానాలకు చేర్చడానికి రైల్వేలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. తాజాగా ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేందుకు సెమీ హైస్పీడ్ రైళ్లు వందేభారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందేభారత్ లు పరుగులు తీస్తున్నాయి. త్వరలోనే మరో రెండు వందే భారత్ లను ప్రవేశపెట్టేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications