మహిళా జడ్జీనే కిడ్నాప్ యత్నం: క్యాబ్ డ్రైవర్ అరెస్ట్
దేశ రాజధానిలో ఓ మహిళా న్యాయమూర్తి కిడ్నాప్ యత్నం ఘటన కలకలం రేపింది. మహిళా జడ్జీ ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌నకు యత్నించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ మహిళా న్యాయమూర్తి కిడ్నాప్ యత్నం ఘటన కలకలం రేపింది. మహిళా జడ్జీ ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌నకు యత్నించిన క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
క్యాబ్ డ్రైవర్ తాను చెప్పినట్టు కర్‌కర్‌దూమా కోర్టుకు కాకుండా జాతీయ రహదారి -24పై ఉన్న హపూర్ వైపు కారును మళ్లించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో న్యాయమూర్తి వెల్లడించారు. వాహనాన్ని వేగంగా మరోవైపు పోనిస్తుండగా ఆమె వెంటనే సహచరులకు, పోలీసులకు సమాచారం అందించారు.

కాగా, కొంతదూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ మళ్లీ ఢిల్లీకి యూ-టర్న్ తీసుకున్నాడు. కారును వెంబడించిన పోలీసులు ఘాజిపుర్ టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడు ఓ ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని తెలిసింది.












Click it and Unblock the Notifications