వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిరిండియా విమానంకు తప్పిన పెను ముప్పు..గాలిలో ఉండగా ఏంజరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఎయిరిండియా విమానంలో మరో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్లే బోయింగ్ 787 విమానంలోని క్యాబిన్‌లో సాధారణ స్థాయికంటే అధిక పీడనం డెవలప్ అవడంతో రాజస్థాన్‌ గగనతలంలో ఉన్న విమానంను తిరిగి ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్లు ఎయిరిండియా అధికారులు తెలిపారు.

Cabin decompression on Air India flight, all passengers safe

బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఢిల్లీ విమానాశ్రయం నుంచి బుధవారం మధ్యాహ్నం 1:29 గంటలకు బయలుదేరింది. 21,900 అడుగుల ఎత్తుకు విమానం చేరుకోగానే విమానంలోని ఆక్సిజన్ మాస్క్‌లు ఆటోమేటిక్‌గా ప్రయాణికుల తలలపైకి వాలిపోయాయి. విమానంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతే ఈ మాస్క్‌లు కిందకు వస్తాయి.ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఢిల్లీ విమానాశ్రయానికి సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమయంలో విమానం రాజస్థాన్ గగనతలంలో ఉంది. వెంటనే వెనుదిరిగి మధ్యాహ్నం 3:33 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఎయిరిండియా విమానంలో ప్రతి ప్రకటన తర్వాత విధిగా ఈ నినాదం చెప్పాలి: సిబ్బందికి ఆదేశాలుఎయిరిండియా విమానంలో ప్రతి ప్రకటన తర్వాత విధిగా ఈ నినాదం చెప్పాలి: సిబ్బందికి ఆదేశాలు

విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉండటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతికలోపంతో విమానం ఢిల్లీకి తిరిగి చేరుకుందని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు హోటల్‌లో బస ఏర్పాటు చేశామని మార్చి 7వ తేదీ ఉదయం 6 గంటలకు మరో విమానంలో ప్రయాణికులను ఫ్రాంక్‌ఫర్ట్ పంపించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే గతేడాది జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు చాలా మంది ముక్కులు, చెవుల నుంచి రక్తస్రావం జరిగింది. ఆ సమయంలో విమానం ముంబై నుంచి జైపూర్ వెళుతోంది.

English summary
Air India Delhi to Frankfurt flight (Boeing 787) returned to Delhi from Rajasthan airspace due to Cabin decompression at 20,000 feet on Wednesday.Aircraft took off today at 1:35 pm and returned to Delhi from Rajasthan airspace at around 4 pm. Around 191 people were onboard and all are reported to be safe, according to news agency ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X