వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌బిఐ తరహలోనే ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ఒకే చెప్పిన కేంద్రం

ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలను తీసుకొంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏకీకృతం చేసి వాటి సామర్ధ్యాన్ని, స్థాయిని మరింత పెంచనుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం చర్యలను తీసుకొంటోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏకీకృతం చేసి వాటి సామర్ధ్యాన్ని, స్థాయిని మరింత పెంచనుంది.ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది.

పీఎస్‌యూ బ్యాంకులను విలీనం చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయంగా అంగీకరించింది.దీంతో బుధవారం ప్రభుత్వ బ్యాంకుల షేర్లు అమాంతం లాభాల బాట పట్టాయి. పీఎస్‌యూ బ్యాంక్ నిఫ్టీ సూచీ 1.8 శాతం మేర పెరిగి 3,290.4 పాయింట్లు లాభపడింది.

Cabinet approves plans to merge some state-run banks

4.9 శాతంతో అలహాబాద్ బ్యాంకు అత్యధిక లాభాలను నమోదు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.8 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంకు 3.44 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.6 శాతం, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ 1.37 శాతం లాభాలు నమోదు చేసింది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేసేందుకు తరచూ మూలధనాన్ని సర్దుబాటు చేయాల్సిరావడంతో... ప్రభుత్వ సాయం లేకుండానే బ్యాంకులు నడిచేలా వాటిని ఏకీకృతం చేయాలని కేంద్రం భావిస్తోంది.

ప్రపంచ స్థాయిలో ఆరు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులను సృష్టించాలని యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బలహీనమైన బ్యాలెన్స్ షీట్‌తో కొనసాగుతున్న చిన్న బ్యాంకులకు పెద్ద బ్యాంకులు ఆర్ధికంగా ఆదుకునేలా వాటిని తీర్చిదిద్దనున్నారు.. ఎస్‌బీఐకి చెందిన ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం తెరమీదికి వచ్చింది.

English summary
India's federal cabinet on Wednesday gave an "in-principle" approval for the consolidation of state-run banks by merging some of the lenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X