పశ్చిమ బెంగాల్ శారదా స్కాం: సీబీఐని అడ్డుకున్నందుకు క్షమాపణలు చెప్పారు
న్యూఢిల్లీ: శారదా చిట్స్ కుంభకోణంలో విచారణను అడ్డుకున్నందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలరు కే డే, డీజీపీ వీరేంద్ర కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ అత్యున్నత న్యాయస్థానానికి బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు, వేరువేరుగా అఫిడవిట్లు దాఖలు చేశారు.
కాగా, వీరు ఈ నెల 20లోగా సుప్రీం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు అయిన తర్వాతే ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. శారద కుంభకోణం కేసులో విచారణలో భాగంగా ఈ నెల మూడో తేదిన కోల్కతా వెళ్లిన సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగారు. సీబీఐ అధికారులను నిర్బంధించారు. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా సోమవారం పశ్చిమ బెంగాల్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో పాటు అఫిడవిట్లు దాఖలు చేశారు.
అధికార ధిక్కారానికి పాల్పడే ఉద్దేశం లేదని సుప్రీం కోర్టుకు తెలిపారు. సరైన పత్రాలు లేకుండా కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతోనే సీబీఐ అధికారులను అడ్డుకున్నామని తెలిపారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications