దొంగను దొంగ అంటే పరువు నష్టం కాదు: సిబిఐ కోర్టు
న్యూఢిల్లీ: దొంగను దొంగ అంటే అతని పరువుకు నష్టం కలిగించినట్లుగా భావించనక్కర్లేదని సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. భూషణ్ స్టీల్స్ కంపెనీ పన్ను ఎగవేతకు పాల్పడిందని పేర్కొంటూ జై కిషన్ బన్సల్ అనే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ అధికారులకు లేఖలు రాశారు.
దీంతో ఆ కంపెనీ అతనిపై అక్కసుతో ఆయనపై ప్రత్యేక కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా తనకు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ బన్సల్ సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

విచారించిన సిబిఐ న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ జారీ అయిన సమన్లను కొట్టివేశారు. ‘ప్రజావేగు సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వారు. దొంగను దొంగ అంటే ఆ వ్యక్తికి పరువు నష్టంగా భావించరాదు. పన్ను ఎగవేత యూనిట్ అన్నంత మాత్రాన అపఖ్యాతి పాల్జేశారని భావించనక్కర్లేదు' అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండు నేరాలే అయినప్పటికీ కొన్నిసార్లు, లంచం ఇచ్చే వారిని చట్టం బాధితుడిగా పరిగణిస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, సదరు కంపెనీ కోట్లలో పన్ను ఎగవేతకు పాల్పడుతోందని పిటిషనర్ జై కిషన్ బన్సల్ తెలిపారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications