లంకలో దయనీయం.. మరీ ఇండియా.. తోసిపుచ్చిన జై శంకర్
శ్రీలంకలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. దీంతో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటాయి. ఇక పెట్రోలు, డీజిల్ ధరల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో ఆందోళనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే.. తన పదవీకి రాజీనామా చేసి, దేశం విడిచి పారిపోయారు. ఇక ప్రధాని.. విక్రమసింఘే అధ్యక్ష పదవీ చేపట్టారు. తర్వాత ఆర్థిక ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. మరీ శ్రీలంక లాంటి పరిస్థితి ఇతర దేశాలకు వస్తోందా..? భారత్ సంగతేంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.

అబ్బే అదేం లేదు..
అఖిలపక్ష సమావేశం మంగళవారం ఢిల్లీలో జరిగింది. శ్రీలంక లాంటి పరిస్థితి మనకు వస్తే అనే ప్రశ్న రాగా.. విదేశీ వ్యవహారాల శాఖమంత్రి జై శంకర్ తోసిపుచ్చారు. సమావేశంలో పార్లమెంటరీ ఆఫైర్స్ మంత్రి ప్రహ్లాద్ జోషి.. కాంగ్రెస్ నుంచి పీ చిదంబరం,, మాణిక్యం ఠాగూర్, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఎంఎం అబ్దుల్లా హాజరయ్యారు. ఇక అన్నాడీఎంకే నుంచి తంబిదురై, టీఎంసీ నుంచి సౌగట రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, ఆప్ నుంచి సంజయ్ సింగ్, టీఆర్ఎస్ నుంచి కేశవ రావు, బీఎస్పీ నుంచి రితేశ్ పాండే, వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి, ఎండీఎంకే నుంచి వైగో హాజరయ్యారు.

పరిస్థితి రాదు..
శ్రీలంకలో సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. పొరుగున గల దేశంలో సంక్షోభం గురించి స్వతహాగానే చర్చ జరుగుతుంది. కానీ కొందరు దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తోందా అని అడుగుతున్నారు. కానీ అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదని చెప్పారు. గత ఏడు దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితిని శ్రీలంక ఎదుర్కొలేదు. వస్తువులు, ఫుడ్, ఆయిల్, మెడిసిన్స్ లాంటివి దిగుమతి చేసుకోవడం కష్టతరం అవుతుంది.

జోక్యం చేసుకోవాలి..
ఆర్థిక సంక్షోభం తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడింది. లంక సంక్షోభం గురించి జోక్యం చేసుకోవాలని డీఎంకే, అన్నాడీఎంకే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షకాల పార్లమెంట్ సమావేశాల కన్నా ముందే నిర్వహించాలని కోరగా.. ఇవాళ కండక్ట్ చేశాయి.












Click it and Unblock the Notifications